తన కొడుకు క్రికెటర్ అంటున్న కరీనా

0కరీనా కపూర్‌ ముద్దుల తనయుడు తైమూర్‌ అలీ ఖాన్‌ ఇప్పటికే ఫేమస్ అయిపోయాడు. పటౌడీ దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ గారాల పట్టి తైమూర్‌. ఈ చిన్నారి గురించి రోజూ ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు తైమూర్‌ గురించి మరో న్యూస్. తన గారాల పట్టి తైమూర్‌ అలీ ఖాన్‌ను తాతగారిలాగే క్రికెటర్‌ని చేస్తానని అంటుంది కరీనా.

తైమూర్‌ చిన్నవాడు. ఇప్పటికే వాడికి మాకంటే ఎక్కువ స్టార్‌డమ్‌ వచ్చిందనిపిస్తోంది. ఈ విషయంలో మాకు కాస్త కంగారుగా ఉంది. అందుకే ఇంగ్లాండ్‌లోని ఓ బోర్డింగ్‌ స్కూల్లో వాడిని చేర్పించాలనుకుంటున్నాం. వాడి కెరీర్‌ విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడంలేదు. అది వాడికే వదిలేస్తున్నాం. కానీ నాకు మాత్రం తైమూర్‌ని క్రికెటర్‌ని చేయాలని ఉంది” అని చెప్పుకొచ్చింది కరీనా.