సన్నీ రెండవ సిరీస్ వచ్చింది..

0మాజీ పోర్న్ స్టార్ – ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కరణ్ జిత్ కౌర్.. ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ మొదటి పార్ట్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అయిదు సిరీస్ల్లో భాగంగా మొదటి సిరీస్ కు మంచి ఆధరణ రావడంతో రెండవ సిరీస్ ను అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రెండవ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లుగా తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

జీ5 లో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. మొదటి సిరీస్ లో సన్నీలియోన్ జననం – ఆమె కుటుంబ నేపథ్యం – ఆమె ఎలా పెరిగింది ఆమెకు చిన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉండేవి అనే విషయాలతో తెరకెక్కించారు. ఇప్పుడు రెండవ పార్ట్ లో కాస్త మసాలా యాడ్ చేసినట్లుగా ట్రైలర్ను చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైలర్ లో సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా మారినప్పటి సన్నివేశాలను చూపించబోతున్నట్లుగా పేర్కొన్నారు.

సన్నీలియోన్ ఈ రెండవ సిరీస్ లో తల్లిదండ్రుల నుండి ఎదుర్కొన్న విమర్శలు జనాల నుండి ఎదుర్కొన్న సమస్యలతో పాటు డేనియల్తో ప్రేమలో పడటం అతడితో వివాహం ఇతరత్ర విషయాలను చూపించబోతున్నారు. ఈ రెండవ సిరీస్ కోసం సన్నీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సన్నీ సిరీస్ రెండవ భాగం రావడంతో ఫ్యాన్స్ అప్పుడే చూసేస్తున్నారు. సినిమా కంటే రిచ్ గా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. సన్నీలియోన్ జీవితంలోని అన్ని కోణాలను చూపించడం సినిమాలో సాధ్యం కాదు. అందుకే వెబ్ సిరీస్ను ఎంచుకున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు. మిగిలిన మూడు సిరీస్ లను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నద్దం అవుతున్నారు.