వెండితెర పై బుల్లితెర భామ అందాలు

0Karishma Sharma Photo Shootబుల్లితెర భామలు వేడెక్కించే అందాలను ప్రదర్శించే ట్రెండ్ ఈ మధ్య బాగా ఊపందుకుంది. ఏకంగా బాలీవుడ్ బ్యూటీలను కూడా తలదన్నే హాట్ ఫిగర్ అనిపించేసుకుంటున్నారు కూడా. హిందీ టీవీ సిరీస్ లతో పాటు గతేడాది ప్యార్ కా పంచ్ నామా2 చిత్రంలో కనిపించిన కరిష్మా శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది.

సోషల్ మీడియా వేదికగా ఈ భామలు అందాలు కురిపిస్తున్న తీరు బాలీవుడ్ హీరోయిన్లను మించిపోతోంది. తాజాగా కరిష్మా శర్మ షేర్ చేసిన ఓ ఫోటో.. విపరీతంగా షేర్ అయిపోతోంది. ఇందుకు కారణం.. ఈ ఫోటోలో కరిష్మా బ్రా మాత్రమే ధరించి దర్శనం ఇవ్వడమే. నాభి సోయగాలు చూపిస్తూ.. ఇప్పటి ట్రెండ్ అన్నట్లుగా లో వెయిస్ట్ ప్యాంట్ తో భలే సెక్సీ పోజ్ ఇచ్చింది కరిష్మా శర్మ. బుల్లితెరపై ఎప్పుడూ సాంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ ఇలా హాట్ గా కనిపించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఫోటోగ్రాఫర్ జావేద్ ఖన్నా ఈ ఫోటో తీశాడని చెప్పిన కరిష్మా శర్మ.. ఇంత హాట్ గా ఎందుకు మారిపోయిందో పైకి చెప్పలేదు కానీ.. సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల కోసం తను ఏం చేయగలదో ఇన్ డైరెక్టుగా చెప్పినట్లుగా అనిపించడం లేదూ!