ముదిరిన వివాదం – సన్నీకి చెప్పుల దండ…!

0

మాజీ పోర్న్ స్టార్ – బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ లో ‘వీరమదేవి’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. కర్ణాటకకు చెందిన వీరనారి వీరమదేవి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నారు. వాడి ఉదయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కన్నడ ప్రజా సంఘాల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ వీరనారి పాత్రను ఒక పోర్న్ స్టార్ తో చేయించడం ఏంటీ అంటూ కన్నడీగులు తీవ్ర ఆగ్రహంతో రగిలి పోతున్నారు. ముందు నుండే ఈ చిత్రానికి వ్యతిరేకంగా కన్నడ ప్రజా సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు.

తాజాగా ఆ ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకతో పాటు ఎక్కడ కూడా ‘వీరమహాదేవి’ చిత్రాన్ని విడుదల కానివ్వబోం అంటూ కర్ణాటక సామాజిక కార్యర్తలు మరియు యువజన సంఘల నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి ఆందోళను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో సన్నీలియోన్ ను అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు టౌన్ హాల్ లో ఈ చిత్రంకు వ్యతిరేకంగా ధర్నా – నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్బంగా అక్కడ సన్నీలియోన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి తగుల బెట్టారు. ‘వీరమదేవి’ సినిమ పోస్టర్ లను కూడా కాల్చి పారేశారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే సినిమాను విడుదల కానిచ్చే పరిస్థితి లేదనిపిస్తుంది. కన్నడంతో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. వీర నారిగా ఇప్పటికే సన్నీలియోన్ లుక్ రివీల్ అయ్యింది. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సంతోషిస్తున్న సమయంలో ఇలా వివాదం కావడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Please Read Disclaimer