ఉపేంద్రపై తిరుగుబాటు

0కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర గతేడాది పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పార్టీలో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలోని కొందరు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు .

ఆయన పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరపడం లేదని ఓ నియంతలాగా ప్రవర్తిస్తున్నారని మరో రెండు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఆయన మాత్రం ఏ విషయాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మేనిఫెస్టోని రూపొందించిలేదు. ఉపేంద్ర ప్రవర్తనపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా ఉపేంద్ర వర్గం మాత్రం ఇదంతా గిట్టని వారు చేస్తున్న ప్రచారమని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఆయన పార్టీని రద్దు చేసి బిజెపిలో చేతురాని కూడా అంటున్నారు.