క్రైమ్ థ్రిల్లర్ లో వదినా మరిది

0

చాలా పరిమితంగా ఉండే కేరళ బాక్స్ ఆఫీస్ స్టామినాను అమాంతం పెంచేసిన సినిమాగా దృశ్యం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని భాషల్లోనూ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో శ్రీప్రియ దర్శకత్వంలో రీమేక్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది.

దృశ్యం ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఇంకో క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. దాని రెగ్యులర్ షూటింగ్ ఇవాళ ప్రారంభమైన సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది టీమ్. దట్టమైన అడవుల నేపథ్యంలో దేనికోసమో వెతుకుతున్నట్టు అదే షేప్ లో కార్తీ ఫేస్ ని అందులో పొందుపరిచిన విధానం ఆసక్తిగా ఉంది

ఇందులో విశేషం ఏమిటంటే నిజ జీవితంలో వదినా మరుదులు జ్యోతిక కార్తీలు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాక్ ప్రకారం వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నట్టు సమాచారం. మరో కీలక పాత్రలో కట్టప్ప సత్యరాజ్ కనిపిస్తారు. ఏకధాటిగా జరపబోయే షూటింగ్ తో తక్కువ టైంలోనే దీన్ని ఫినిష్ చేయబోతున్నారు.

జ్యోతిక సోదరుడు సూరజ్ దీనికి నిర్మాత. కార్తీ టైం ఖాకీ తర్వాత ఏమంత బాగా లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవ్ దారుణంగా దెబ్బ తింది. ఖైదీ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడీ టైటిల్ ఫిక్స్ చేయని థ్రిల్లర్ ఖచ్చితంగా ఇంకో బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తి.
Please Read Disclaimer