ట్రైలర్ టాక్: డాక్టర్ అండ్ పైలట్ ల ప్రేమ కథ

0మణిరత్నం కొత్త సినిమా వచ్చేస్తోంది. తెలుగులో ”చెలియా” అంటూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదల చేశారు. కార్తి హీరోగా అదితి రావ్ హైదారీ హీరోయిన్ గా రూపొందిన ఈ లవ్ స్టోరీ ఎలా ఉందో చూసేద్దాం పదండి.

కార్తి ఒక పైలట్. అదితి ఒక డాక్టర్. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కాని కొన్ని తేడాలు వచ్చేశాయి. ఈలోగా కార్తీ అవతల దేశాన్ని కాపాడటానికి ఫైటర్ జెట్లో వెళ్ళాలి. ఇదే చూచాయిగా సినిమా. కాకపోతే మణిరత్నం మార్క్ ఎమోషన్లతో సినిమా కాస్త బరువుగా ఉంచే ఛాన్సుంది. ఈ డాక్టర్ అండ్ పైలట్ ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుని ఎలాంటి ఎండింగ్ చేరుకుంటుంది అనేది వెండితెరపైనే చూడాలి. ఎ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ వినసొంపుగానే ఉన్నా కూడా.. ట్రైలర్లో ఏదో ఫీల్ మాత్రం మిస్సయ్యిందనే చెప్పాలి. అసలు కొత్తగా ఉన్న లవ్ పాయింట్ అంటూ ఏం కనిపించట్లేదు. తెలిసిన కథనే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్లు ఉంది.

మొన్నామధ్యన ఓకె బంగారం సినిమా కూడా చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ.. న్యూ జనరేషన్ కు దగ్గరగా ఉండే రొమాన్స్ ఎలిమెంట్స్ తో మణి సార్ ఆకట్టుకున్నారు. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారో!!