జగన్ పాత్రలో ‘చినబాబు’?

0ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి – మహానేన వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న `యాత్ర` బయోపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. మహానేత వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తుండడంతో `యాత్ర`పై ఆ అంచనాలు మరింత పెరిగాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో కీలకమైన వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్యతో పాటు కొందరు బాలీవుడ్ నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఆ పాత్రకు తమిళ నటుడు సూర్య…బాగా సూట్ అవుతాడని చిత్ర యూనిట్ భావించిందట. అయితే సూర్య బిజీగా ఉండడం వల్ల….తన తమ్ముడు హీరో కార్తిని ఆ పాత్రకు సూర్య సజెస్ట్ చేశాడట. దీంతో దాదాపుగా కార్తి ఈ పాత్రలో నటించడం ఖాయమని టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ఆడియన్స్ కు సూర్య సుపరిచితుడు కావడంతో….ఆ పాత్రకు మహి సూర్యను అప్రోచ్ అయ్యారట. సూర్య బాడీ లాంగ్వేజ్..వ్వవహారిక శైలి కూడా జగన్ కు అచ్చుగుద్దినట్లు సూటవుతుందని మహి అనుకున్నాడట. అయితే సూర్య బిజీగా ఉండి….ఆ పాత్రకు కార్తీని రిఫర్ చేసి కన్విన్స్ చేశాడట. `చినబాబు` సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన కార్తిని మహి కలిసి…క్యారెక్టర్ గురించి వివరించాడట. ఆ సినిమాలో జగన్ పాత్ర నిడివి తక్కువే అయినా….పవర్ ఫుల్ రోల్ కాబట్టి కార్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. `చినబాబు`తమిళ ప్రమోషన్ కంప్లీట్ చేసుకొని `యాత్ర`టీమ్ తో కార్తీ జాయిన్ అవుతాడట. ఈ సినిమాలో కీలకమైన వైఎస్ షర్మిల రోల్ కోసం భూమిక పేరు వినిపిస్తోంది. మరోవైపు వైఎస్ నమ్మిన బంటు పాత్రలో పోసాని కనిపించబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం మహి చాలా కష్టపడుతున్నాడని – బెస్ట్ అవుట్ ఫుట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడని మహిపై మమ్ముట్టి ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది.