కేట్ పై కుర్ర హీరో హాట్ కామెంట్స్

0ఈమద్య కాలంలో హాలీవుడ్ కు బాలీవుడ్ ఎక్కడ తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు. సినిమాల మేకింగ్ విషయంలో – కలెక్షన్స్ విషయంలోనే కాకుండా రిలేషన్ షిప్స్ విషయంలో – హాట్ కామెంట్స్ విషయంలో కూడా హాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ స్టార్స్ పోటీ పడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ లో ఈమద్య రిలేషన్ షిప్స్ చాలా కామన్ అయ్యాయి. ఇక కొన్ని టాక్ షోల్లో సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బోల్డ్ గా ఉండటంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ యువ సంచలన హీరో కార్తీక్ ఆర్యన్ ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘సోనూ కే టిటి కి స్వీటీ’ చిత్రంతో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు 100 కోట్లను కొల్లగొట్టడంతో అందరి దృష్టిని కార్తీక్ ఆర్యన్ ఆకర్షించాడు. మంచి నటుడిగా పేరు దక్కించుకున్న కార్తీక్ భవిష్యత్తులో బాలీవుడ్ లో స్టార్ అవుతాడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఈ యువ హీరో సక్సెస్ కిక్ లో ఉన్నాడో ఏమో కాని సీనియర్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వీడు మామూలోడు కాదు అనిపించుకున్నాడు.

ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో అనిత ష్రాఫ్ హోస్ట్ గా ప్రసారం అయ్యే టాక్ షోలో కార్తీక్ ఆర్యన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో హోస్ట్.. మీరు పిల్లలను కనాల్సి వస్తే ఎవరితో కంటారు అంటూ ప్రశ్నించింది. అందుకు కార్తీక్ ఆర్యన్ వెంటనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా పేరు చెప్పేశాడు. ఆమె ఎందుకు అనే విషయంలో కూడా ఆయన పక్కాగా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ టాక్ షో త్వరలో ప్రసారం కాబోతుంది. టాక్ షోకు సంబంధించిన చిన్న బిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ టాక్ షోలో కార్తీక్ ఆడవారి గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా ప్రమోషన్ బిట్ లో చూపించారు. పూర్తి ఇంటర్వ్యూ వస్తే కాని అసలు మ్యాటర్ ఏంటో తెలియదు.