లెజెండ్స్ తో సినీరచయిత కరుణానిధి

0తమిళ సినీరంగంలో లెజెండ్స్ గా పేరుబడిన ఎంజీఆర్ – శివాజీ గణేషన్ సహా పలువురు స్టార్లతో కలిసి పని చేశారు ఎం.కరుణానిధి. స్క్రిప్టు రచయితగా – లిరిసిస్టుగా ఆయన ప్రసిద్ధుడు. దాదాపు 40 సినిమాలకు ఆయన స్క్రిప్టు అందించారు. ఎన్నో పాటలు రాశారు. తమిళ సినీరంగంలో లెజెండ్స్ అనదగ్గ ప్రముఖులతో ఆయన పలు సినిమాలకు రచయితగా పని చేశారు. లెజెండరీ నటుడు ఎంజీ రామచంద్రన్ – సూపర్ స్టార్ రజనీకాంత్ – హీరో విజయ్ కాంత్ – కమల్ హాసన్ – జయలలిత వంటి వారితో ఆయన పలు విజయవంతమైన చిత్రాలకు పని చేశారు.

1947లో రాజకుమారి అనే చిత్రానికి ఆయన రచయితగా పని చేశారు. ఈ సినిమా కోసం చెన్నయ్ జూపిటర్ స్టూడియోస్ హెడ్ జూపిటర్ సోము ఓ టాస్క్ని ఇచ్చారు. అరేబియన్ నైట్స్ తరహాలో కథానాయకుడిపై సాహసోపేతమైన సన్నివేశం రాసుకుని రమ్మని యువరచయిత అయిన కరుణానిధికి ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ని కరుణానిధి విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సినిమాతోనే అథ్లెటిక్ హీరో ఎంజీఆర్ అలియాస్ మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ తెరకు పరిచయం అయ్యారు. ఆ క్రమంలోనే ఎంజీఆర్ కి ఎం.కరుణానిధి రచయితగా మరింత చేరువయయారు. ఆ తర్వాత 1948లో అభిమన్యుడు అనే చిత్రానికి కరుణానిధి పని చేశారు. ఎంజీఆర్ ఈ చిత్రంలో అర్జునుడిగా నటించారు. 1952లో పరాశక్తి అనే చిత్రానికి కరుణానిధి రచయితగా వర్క్ చేశారు. ఈ సినిమాలో అప్పటికే తమిళ నాట సంఘంలో పేరుకుపోయిన అవినీతి – రాజకీయ దుష్ఠ శక్తుల్ని ప్రశ్నిస్తూ పలు సన్నివేశాల్ని రాశారు. ఈ సినిమాతోనే తమిళ సినిమా గ్రేట్ హీరో శివాజీ గణేషన్ తో కరుణానిధి అనుబంధం మరింత బలపడింది. అప్పటికే ద్రవిడియన్ పాలిటిక్స్ లో వేడి పెరిగింది. సంఘంలోనే అవ్యవస్థను ప్రశ్నిస్తూ తెరకెక్కిన పాణమ్ (1992) అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఈ సినిమాలో తమిళ రాజకీయాల్ని ప్రశ్నిస్తూ కరుణానిధి రాసిన డైలాగులు – లిరిక్స్ పెనుదుమారం రేపాయి. అప్పట్లోనే కన్నదాసన్ – ఎన్.ఎస్.క్రిషన్ వంటి రచయితలతో కలిసి కరుణానిధి కలాన్ని ఝలిపించారు. కరుణానిధి వచనంలో బలం ఎంతో అతడి సినిమా రచనలు పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. నాటి రాజకీయాల్ని ప్రశ్నిస్తూ పలు సన్నివేశాల్లో – లిరిక్స్ లో కరుణానిధి ఉపయోగించిన పదాల్ని సెన్సార్ చేయాల్సిందిగా ప్రభుత్వాలు హుంకరించాయంటే ఆయన ఉపయోగించిన భాషలో పదును ఎంతో అర్థం చేసుకోవచ్చు. 1953లో రిలజీఐన `తిరుంబిప్పార్` చిత్రంలో జాతీయ కాంగ్రెస్ నాయకుడు – నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని విమర్శిస్తూ ఓ డైలాగ్లో `ఉమనైజర్` అని రాయడం సంచలనమైంది. నాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ద్రవిడియన్ ఉద్యమానికి మద్దతుగా కరుణానిధి కలం సినిమాలకు పని చేసింది. `తిరుంబిప్పార్` కరుణానిధి రచనల్లో ఒకానొక బెస్ట్ అంటూ శివాజీ గణేషన్ ప్రశంసించారు. అత్య ంత పవర్ఫుల్ స్క్రిప్టుతో తీసిన చిత్రమిదని ప్రముఖ క్రిటిక్ ఎస్.విశ్వనాథన్ కరుణానిధి పనితనాన్ని ప్రశంసించారు. ఆ క్రమంలోనే సిఎన్ అన్నాదురై నాయకుడిగా పెరియార్ ఉద్యమానికి బాసటగా నిలిచిన కరుణానిధి ద్రవిడ మున్నేట్ర కజగమ్ పార్టీలో చేరారు. సినిమా – రాజకీయాలు రెండిటినీ సమాంతరంగా కొనసాగించారు. శివాజీ గణేషన్ మనోహర (1954) చిత్రానికి ఆయన నాటి సామాజిక పరిస్థితులకనుగుణంగా కథను అందించారు. ఎంజీ రామచంద్రన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటించిన మలైకాలన్ చిత్రానికి కరుణానిధి స్క్రిప్టును అందించారు. ఎంజీఆర్ అంతటి గొప్ప నటుడిని తయారు చేసింది ఆయన రచనలేనని చెబుతారు.