నాని కోసం నర్తనశాల బ్యూటీ

0



న్యాచురల్ స్టార్ నాని గత చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ప్రేక్షకులను నిరాశ పరించింది గానీ అంతకుముందు నాని పట్టిందల్లా బంగారమే.  వరస హిట్లు. ఇప్పుడు కూడా తన నెక్స్ట్ సినిమా ‘దేవదాస్’ అక్కినేని నాగార్జున తో కలిసి నటిస్తున్న క్రేజీ మల్టిస్టారర్.  సెప్టెంబర్ చివరి వారంలోనే విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా తర్వాత నాని ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాను లైన్ లో పెట్టాడు.

‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నానికి జోడీగా కష్మీర పరదేశి ని ఎంపిక చేశారట. ఈ పూణే సుందరి నాగ శౌర్య హీరో గా నటించిన ‘@నర్తనశాల’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సినిమా నిరాశపరిచింది గానీ సినిమాలో తన నటన – స్క్రీన్ ప్రెజెన్స్ ‘జెర్సీ’ మేకర్స్ ను ఆకర్షించాయట. బబ్లీ గర్ల్ లా కనిపించిన ఈ కొత్త బ్యూటీ నాని కూడా ఇంప్రెస్ చేసిందట. దీంతో నాని సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ఈమధ్య న్యాచురల్ స్టార్ కొత్త హీరోయిన్లకు తన సినిమాలలో అవకాశం ఇస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధం లో రుఖ్సార్ ధిల్లాన్.. దేవదాస్ లో రష్మిక మందన్న(ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గానీ సైన్ చేసినప్పుడు ఇంత క్రేజు లేదు).. ఇప్పుడేమో కష్మీర పరదేశి.