కాటమరాయుడుకి క్లీన్ ‘యూ’

0Katamarayudu-censor-ratingపవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు ఇప్పుడు అన్ని విధాలా రిలీజ్ కు రెడీ అయిపోయింది. రీసెంట్ గా ఫైనల్ కాపీ సిద్ధం చేసుకుని సెన్సార్ కు అప్లై చేసుకోగా.. ఇవాళ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి.

కాటమరాయుడు మూవీకి క్లీన్ ‘యూ’ అందిస్తూ.. సర్టిఫై చేససింది సెన్సార్ బోర్డ్. యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పుడు ఈ నెల 24న విడుదలయ్యేందుకు అన్ని విధాలుగాను సిద్ధమైపోయింది. అయితే.. కాటమరాయుడు మూవీకి యూ సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. పవర్ స్టార్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన ఈ మూవీని.. కంప్లీట్ యాక్షన్ అండ్ రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కించారు. సెంటిమెంట్ సీన్స్ కు కొదువ ఏమీ ఉండదు. ఇప్పటికే కోటి వ్యూస్.. రెండున్నర లక్షల లైక్స్ సాధించిన టీజర్ కూడా.. పూర్తి స్థాయి యాక్షన్ సీన్స్ తో మిళితం అయి ఉంది.

ఈ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాకి యూ సర్టిఫికేట్ లభించడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇక దాదాపు 100 కోట్ల బిజినెస్ జరుపుకున్న కాటమరాయుడుపై.. ఇండస్ట్రీ జనాల్లో మంచి బజ్ ఉండగా.. సక్సెస్ పై పూర్తి కాన్ఫిడెంట్ తో ఉంది యూనిట్. పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ జోడీ కట్టడం కూడా కాటమరాయుడికి సానుకూల అంశంగా చెప్పచ్చు.