అంచనాలను పెంచేసిన కాటమరాయుడు టీజర్

0పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ నుంచి ఇప్పటివరకూ.. మూవీపై హైప్ క్రియేట్ అయ్యేలా ఒక్క అంశం కూడా లేదు. సాధారణ ఆర్టిస్టులను తమ్ళుళ్లుగా సెలక్ట్ చేయడం నుంచి.. హీరోయిన్ ని కూడా రిపీట్ చేయడం కూడా క్రేజ్ తీసుకురాలేకపోయింది.

ముందే సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ ముంది. దానికి తోడు.. స్టార్స్ ను హ్యాండిల్ చేయలేడని దర్శకుడు డాలీపై విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు రీమేక్ సినిమా. అది కూడా తెలుగులో డబ్బింగ్ వెర్షన్ వచ్చేసింది. ఇవన్నీ కాకుండా.. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ కూడా హైప్ క్రియేట్ చేయడంలో ఏమాత్రం హెల్త్ చేయలేకపోయాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్.. సినిమాపై ఉన్న మూడ్ మొత్తాన్ని మార్చేసింది. యూట్యూబ్ లో సృష్టిస్తున్న సెన్సేషన్స్ చూస్తుంటే.. పవన్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది.

ఇప్పటివరకూ బేరాలాడిన వాళ్లు కూడా ఇప్పుటు ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తూ.. నిర్మాత శరత్ మరార్ వెనక తిరుగుతున్నారు. కొన్ని ఏరియాల్లో మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150ని మించి బిజినెస్ జరిగిపోతోంది. ఇదంతా.. 30 సెకన్ల టీజర్ లో పవన్ చూపించిన మాస్ మసాలా యాక్షన్ కంటెంట్ మహిమ. 30 సెకన్లతోనే ఇన్ని సెన్సేషన్స్ సృష్టిస్తున్న పవన్.. కాటమరాయుడును 100 కోట్ల షేర్ సాధిస్తుందనే అంచనాలకు తీసుకొచ్చేశాడు. దటీజ్ పవర్ స్టార్ అనాల్సిందే కదూ!!