కాటం రాయుడు కాటేసాడు

0Pawan-Kalyan-lands-in-legalకాటంరాయుడు పాట పాపం అత్తారింటికి దారేది సినిమాను నిర్మాతను కాటేసిందట. అది హిట్టవుతుందా, ఫట్టవుతుందా.. అంటే ఇప్పటి వరకు దానికి వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయి అది హిట్టే అంటున్నారు. కాని ఇది చూసుకుని మురిసిపోవాలో, ఆపాట వేసిన కాటుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నిర్మా బివిఎస్ఎన్ ప్రసాద్ ది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఈపాట కోసం ఎంత రిహార్సల్ చేయాల్సి వస్థుందో, ఎంత సమయం పడుతుందో అంటూ దేవీశ్రీప్రసాద్ శబ్దాలయా రికార్డింగ్ స్టూడియోను ఒక రోజంతా రెంట్ కు తీసుకుని ఆడబ్బులు కూడా నిర్మాత ప్రసాద్ తో కట్టించేసాడట. పవన్ తనను నమ్ముకున్న నిర్మాతలను ఎప్పుడు ముంచడని, ఆనందంలోనే ఉంచుతాడని అన్న టాక్ ఉంది. అందుకే ఈ సాహసం చేసాడు ప్రసాద్.

కాని అలా వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా ‘కాటంరాయుడా.. కదిలి నరసింహుడా…’అంటూ పాడేసి తన గాత్రం తడాఖాను ఓ గంటలోనే చూపించి వెల్లిపోయాడు. పాటను ఓ ప్రొఫెషనల్ సింగర్ తరహాలో పాడేసి అదరగొట్టి అంతలోనే మాయమయ్యాడు. కాని ఓగంట కోసం ఓరోజంతా స్టూడియోకు రెంట్ కట్టిన నిర్మాత ప్రసాద్ కు పాట బాగా వచ్చినందుకు సంతోష పడాలా, ఓ గంట కోసం 24 గంటల సొమ్ము పోయినందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడిపోయాడట పాపం ప్రసాద్.