శిల్పా బ్రదర్స్ ఎఫెక్ట్; కాటసాని అసంతృప్తి!

0silpa-chakrapani-reddy-may-శిల్పా చక్రపాణి రెడ్డిని చేర్చుకుంటున్న వైసిపికి ఆ పార్టీ బనగానపల్లి ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఝలక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికలో టికెట్‌ను శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వడంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న వైసిపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల బరిలో వైసిపి తరపున రాజగోపాల్ రెడ్డి ఉంటారని గతంలో కాటసాని ప్రకటించారు.

అయితే, టిడిపిని వీడి వైసిపిలో చేరిన శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన షాకయ్యారని అంటున్నారు. వాస్తవానికి నంద్యాల ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాటసాని మొదట్లో ప్రయత్నించారని చెబుతున్నారు.

దీంతో ఆయనకు అధినేత జగన్ క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో, కాటసాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనడం లేదని చెబుతున్నారు.

పార్టీకి చెందిన నేతలను కూడా కాటసాని కలవడం లేదంటున్నారు. మరోవైపు, తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు.

గురువారం జగన్ నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో జగన్ ఉంటారా లేదా అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా కాటసాని వైసిపికి దూరం జరుగుతున్నారనే ప్రచారం సాగుతోంది.