బాహుబలి ఫార్ములా ఎన్టీఆర్ కి పనికొస్తుందా?

0

బాహుబలి ఫార్ములాను ఇతరులు ఫాలో అవడం మంచిదే కానీ ‘బాహుబలి’ లో ఉన్న స్టఫ్ కూడా ఉంటేనే అది వర్క్ ఔట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ.. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’.. ‘2.0’ లకు కూడా ‘బాహుబలి’ తో పోలికలు తప్పడం లేదు. ఈ రెండు సినిమాల టీజర్లు చూసి.. కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడినట్టుగా ఉందని ఇప్పటికే కొంతమంది చెణుకులు విసురుతున్నారు. సరే… అవన్నీ పక్కన బెడితే.. ‘కథా నాయకుడు’.. ‘మహానాయకుడు’ ఇది మన కథ.

అందరూ ఒక టికెట్ పై ఒక బయోపిక్ చూద్దామని డిసైడ్ అయితే క్రిష్ అండ్ టీం మాత్రం ఒక టికెట్ ‘సినిమా పిక్’ రెండో టికెట్ తో ‘పాలిటిక్స్ పిక్’ చూడమని శెలవిచ్చారు. ఇక కమర్షియల్ గా రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆడియన్స్ రెస్పాన్స్ ను బట్టి ఉంటుంది కాబట్టి దాని విషయం రిలీజ్ తర్వాతే మాట్లాడుకోవాలి. అసలు ఈ రెండుపార్టుల రిలీజ్ ప్లాన్ ఎలా ఉంది అంటే సోషల్ మీడియా లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోజారిటీ జనాలు చెప్పేది మాత్రం ఒకటే. అసలు ఎన్టీఆర్ లైఫ్ లో ‘మసాలా స్టఫ్’ ఉండేది పొలిటికల్ లైఫ్ లోనే. అందరి ఇంట్రెస్ట్ దానిపైనే. ఓన్లీ ‘కథానాయకుడు’ తీసుకుంటే అందులో మసాలా డెఫినిట్ గా మిస్ అవుతుంది. ఎన్టీఆర్ స్వశక్తి తో పైకి వచ్చినా ఆ తర్వాత అయనకు కథానాయకుడిగా తిరుగులేదు. సో.. గ్లామర్ తప్ప పెద్దగా ట్విస్ట్ లు టర్న్ లు ఉండవు.

ఇక సెకండ్ పార్ట్ విషయానికి వస్తే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్.. చంద్రబాబు నాయుడు తన మామగారి నుండిఅధికారం ‘చేజిక్కించుకోవడం’.. ఎన్టీఆర్ కు కుటుంబసభ్యులు దూరంగా ఉండడం. ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం లాంటి నిజంగా జరిగిన సంఘటనలు కనుక ఉంటే అది నిజంగా బాహుబలి కి కట్టప్ప ఎపిసోడ్ బలంగా మారినట్టు ‘మహానాయకుడు’ భాగానికి కీలకంగా మారుతుంది. సో.. అది లేకుండా ‘మహానాయకుడు’ కంప్లీట్ కాదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా జనాలకు అందరికీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగిందనే అవగాహన ఉంది కాబట్టి వెన్నుపోటు ఎపిసోడ్ ను కవరప్ చేసి క్రిష్ & టీమ్ ప్రేక్షకులను మభ్యపెట్టలేరు.

‘ఎన్టీఆర్’ ఒక్కటే పార్ట్ అయితే చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న ఎపిసోడ్ లేకపోయినా నెట్టుకురావచ్చు. ఎందుకంటే సినిమా – పాలిటిక్స్ దాదాపుగా కవర్ అవుతాయి. ఇప్పుడు రెండు భాగాల కారణంగా పరిస్థితి అలా ఉండదు. పైగా ఫస్ట్ పార్ట్ హెవీ కాంపిటీషన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి రిజల్ట్ అటూ ఇటూ అయితే రెండు వారాల లోపే రిలీజ్ కానున్న ‘మహానాయకుడు’ పై ఆ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది. ఓవరాల్ గా రెండు పార్టుల వ్యవహారం పై నెటిజనులు ఎక్కువమంది పాజిటివ్ గా లేరు. మరి క్రిష్ ఏం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.
Please Read Disclaimer