కత్తి మహేష్ గొంతు నొక్కలేరు!

0ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ట్విట్టర్ ఖాతాపై పవన్ ఫ్యాన్స్ ఫిర్యాదు చేయడంతో ఆయన ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై పవన్ ఫ్యాన్స్ పై మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. ట్విట్టర్ ఫేస్ బుక్ ఖాతాలను బ్లాక్ చేయించడం ద్వారా నా నోరు మూయించలేరని తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఉంటానని మహేష్ అన్నారు. పవన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా కూడా భరించలేని స్థితిలో పవన్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారని మహేష్ చెప్పారు. తన నోరు మూయించాలని పవన్ ఎందుకు అంత డెస్పరేట్ గా ఉన్నాడో తనకు అర్థం కావడం లేదని మహేష్ అన్నారు. తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మహేష్….యూట్యూబ్ లో ఓ వీడియోను విడుదల చేశారు.

“నా ఫేస్ బుక్ – ట్విట్టర్ ఖాతాపై కొన్ని లక్షలాది మంది పవన్ కల్యాణ్ అభిమానులు ఫిర్యాదు చేయడంతో అవి బ్లాక్ అయ్యాయి. ఈ ట్వీటమ రాయుడి ట్వీట్లకు రెస్పాండయితే కూడా సమాధానం చెప్పుకోలేని…సిగ్గుతో తలవంచుకునే పరిస్థితుల్లో ….ఏం ట్వీటమ రాయుడు….ఏం కాటమరాయుడో…ఏం పవర్ స్టార్ పవన్ కల్యాణో….నాకైతే అర్థం కావడం లేదుగానీ….ఇంత భయమైతే ఎలాగయ్యా నీకు….అంటే కనీసం….ఎదుటోడు నీకు వ్యతిరేకంగా భావ వ్యక్తీకరణ చేస్తేనో….నీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే కూడా భరించలేని ఫ్యాన్స్…ఎదుర్కోలేని నువ్వు….ఛీ అనిపిస్తోంది. అంతకు మించి చెప్పేదేమీలేదు. తనకు ట్విట్టర్ లేకపోయినా….ఫేస్ బుక్ లేకపోయినా నా మాటలు ఆగవు….. నా నోరు మూయించడానికి నువ్వు అంత డెస్పరేట్ గా ఎందుకున్నావో నాకైతే అర్థం కాదు…నా నోరైతే మూత పడదు…క్యారీ ఆన్“అని కత్తిమహేష్ అన్నారు.