జనసేన కు కత్తి మహేష్ వార్నింగ్..

0కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అభిమానులకు , కత్తి మహేష్ కు మధ్య వివాదం ఎంత వరకు వెళ్లిందో తెలియంది కాదు..పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ కామెంట్స్ చేయడం తో పవన్ ఫ్యాన్స్ , ఏకంగా మహేష్ ఫై దాడికి వరకు వెళ్లారు. వాళ్ళు , వీళ్ళు కలిసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న మహేష్ , మరోసారి జనసేనకు వార్నింగ్ ఇచ్చి మళ్లీ వార్తల్లో నిలిచాడు.

‘‘మళ్లీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉన్మాదాలు పెరిగిపోతున్నాయి. ఈసారి నేను బయటకు వచ్చానంటే మీ పవర్ స్టార్ రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి వస్తుంది. నన్ను మళ్లీ మళ్లీ కెలక్కండి. జనసేన పార్టీ.. దాని లీడర్స్‌కి నేను వార్నింగ్ ఇస్తున్నా. నాతో పెట్టుకోవద్దని మీ ఫ్యాన్స్‌తో చెప్పండి’’ అంటూ కత్తి మహేష్ ట్వీట్‌లో పోస్ట్ చేసాడు. మరి ఇప్పుడు పవన్ అభిమానులు , జనసేన కార్య కర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.