ఎవరితో తిరిగితే మీకెందుకు అది పూర్తిగా నా వ్యక్తిగతం : కత్రినా

0

katrina-angry-on-reportsబాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పర్సనల్ విషయాలు అనుమతి లేకుండా బయట పెట్టే హక్కు మీకెక్కడిది అంటూ మీడియాపై మండిపడింది. ఈ మేరకు మీడియా వారికి బహిరంగ లేఖ రాసింది. ఇటీవల రణబీర్‌తో కలిసి కత్రినా విదేశాలకు విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడవారిద్దరి రొమాన్స్ ఫోటోలు మీడియాలో హల్‌చల్ చేశాయి.

వెండితెరపై కంటే బయటే వీరి కెమిస్ట్రీ బాగుందని మీడియా కోడైకూస్తోంది. ఫొటోస్‌లో మసాలా కూడా అంతే ఘాటుగా ఉంది మరి. అయితే తన పర్సనల్ విషయాలు ఇలా బట్టబయలవడంపై కత్రినా ఆవేదన వ్యక్తం చేసింది. తాను, రణ్‌బీర్‌తో కలిసి తిరిగిన ఫోటోలు ఓ ఫిల్మ్ మ్యాగజైన్‌లో రావడంపై తాను తీవ్రంగా బాధపడుతున్నానని తెలిపింది.

నేను ఎవరితో తిరిగితే మీకెందుకు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నా అనుమతి లేకుండా నా ఫోటోలు తీసి వాటిని వాడుకునే హక్కు మీకెక్కడిదంటూ కత్రినా లేఖలో తన కోపాన్ని బయటపెట్టింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల విషయాల్లో అతిగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత స్వేచ్చగా భంగం కలిగిస్తున్నారని కత్రినా ధ్వజమెత్తింది. మీడియాతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇకనైనా ఫోటోల రాద్దాంతానికి తెర దించాలని ఆమె తన లేఖలో విజ్ఞప్తి చేసింది.Please Read Disclaimer