బాహుబలికి బిస్కెట్ వేసేసింది

0


Katrina-Picks-Prabhasబాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్ మూవీస్ చేసింది ఈ కత్తి లాంటి బ్యూటీ. వెంకటేష్ తో మల్లీశ్వరి.. బాలకృష్ణతో అల్లరి పిడుగు వంటి సినిమాల్లో నటించింది కత్రినా కైఫ్. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించేసుకుని.. తెలుగుపై కన్నెత్తి చూడ్డం మానేసింది.

రీసెంట్ గా అయితే.. ప్రభాస్ తో సాహో మూవీలో హీరోయిన్ గా నటించాలంటూ బాలీవుడ్ భామలను సంప్రదించగా.. మొదటగా వినిపించిన పేరు కత్రినా కైఫ్ దే. బాహుబలి తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ పేరు మామూలుగా మోగిపోవడం లేదు. అనేక మంది బాలీవుడ్ తారలు.. ప్రభాస్ తో సినిమా చేయడంపై ఉత్సాహం చూపుతుండగా.. ఇప్పుడీ లిస్ట్ లో కత్రినా కూడా చేరిపోయింది. రీసెంట్ గా జరిగిన సైమా అవార్డుల వేడుకలో.. బాలీవుడ్ మూవీ జగ్గా జాసూస్ కి ఓ ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన మాజీ లవర్ అండ్ జగ్గా జాసూస్ హీరో రణబీర్ తో కలిసి హాజరైన కత్రినా.. సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మళ్లీ సౌత్ లో అవకాశాలు వస్తే.. దక్షిణాదిలో ఎవరితో కలిసి నటించాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు.. ‘విక్రమ్ అద్భుతమైన యాక్టర్. ఇక బాహుబలి ప్రభాస్ కనబరిచిన నటన సూపర్’ అంటూ పొగిడేసింది. ప్రభాస్ తో నటించాలనే కోరికను బయటపెట్టి.. ఓ సీట్ రిజర్వ్ చేయమంటూ ఇన్ డైరెక్టుగా బిస్కెట్ వేసేసింది.