లిప్ లాక్ పై కత్రినా కస్సుబుస్సు

0Jaggs-Jasoos-Posterరణబీర్ కపూర్ – కత్రినా కైఫ్.. కొన్ని నెలల క్రితంవరకూ వీరిద్దరూ బాలీవుడ్ హాట్ పెయిర్. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ రొమాన్స్ పండించేశారు. సడెన్ గా ఏమైందో కానీ.. ఇద్దరూ విడిపోయారని.. బ్రేకప్ చెప్పేసుకున్నారనే విషయం తెలిసిపోయింది. అప్పటి నుంచి ఓ సినిమా సంగతి సంక్షోభంలో పడిపోయింది.

రణబీర్-కేట్ ల బ్రేకప్ కారణంగా.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గా జాసూస్ మూవీ.. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు ఓ పోస్టర్ విషయంలో హీరోయిన్-డైరెక్టర్ మధ్య వివాదం తలెత్తిందట. కత్రినాకు రణబీర్ లిప్ లాక్ చేసే ఈ పోస్టర్ ను విడుదల చేయడానికి వీల్లేదని ఖరాఖండీగా తేల్చేస్తోందిట కేట్. సినిమాలో కూడా ఆ సీన్ ఉండడానికి వీల్లేదన్నది ఆమె వెర్షన్. ఈ విషయంపై కత్రినాను కన్విన్స్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు అనురాగ్ బసు.

అంతే కాదు.. ఈ కిస్సింగ్ సీన్ కి ఫ్యూచర్ ప్రమోషన్స్ కి కూడా కేట్ లింక్ పెడుతోందని టాక్. ఇన్నేసి వివాదాలు అన్నీ దాటుకుని అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనే డౌట్ చాలా మందికి వస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 14న జగ్గా జాసూస్ రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు నిర్మాతలు. అప్పటికే ఎన్ని సీన్లు ఉంటాయో.. ఎన్ని కిస్సులు ఎగిరిపోతాయో!