పూల గౌన్ లో క్యూట్ గా ఉందే

0

బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల బ్యాచ్ పెద్దదే. ఆ లిస్టులో ఇంకా ఇప్పటికీ క్రేజ్ ఉన్న హీరోయిన్ కత్రినా కైఫ్ మాత్రమే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదిహేనేళ్ళు దాటిందంటే కేట్ సీనియారిటీని మనం అర్థం చేసుకోవచ్చు. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మరో పది రోజుల్లో ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది కత్రినా.

ఇదిలా ఉంటే తన ఇన్స్టా ఖాతా ద్వారా రోజుకు రెండు మూడు అప్డేట్లు ఇస్తూ అభిమానులను మురిపిస్తోంది. జస్ట్ ‘భారత్’ కు సంబంధించిన అప్డేట్లు మాత్రమే కాదు. కలర్ ఫుల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎన్నికల ఫలితాల వేడికి బుర్రలు హీటెక్కిన నెటిజనులకు మలయమారుతంలా సాంత్వననిస్తోంది. అదేంటి.. హాటు బ్యూటీలు ఫోటోలు పోస్ట్ చేస్తే హీట్ పెరగాలి కదా కూల్ బ్రీజ్ లాగా మనకు హాయిగా తగలడం ఏంటి? మనం రిలాక్స్ అవ్వడం ఏంటని అవాక్కవుతున్నారా. పతాని మేడమ్ లాగా ఇన్నర్ వేర్ షూట్ చేస్తే హీటు హాటు ఘాటు. అవేవీ లేకుండా సింపుల్ గా ఒక కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని హాయిగా నవ్వితే హీటు ఎందుకు.. అంతా కూల్ గా ఉంటుంది కదా.

ఈ ఫోటోలకు కత్రినా ఇచ్చిన క్యాప్షన్ “ఫూలోసే భరా భారత్”. అందరూ హీరోయిన్లు ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఇస్తే కేట్ మాత్రం హిందీలో ఇచ్చింది. అర్థం అయిందిగా.. భారత్ పూలతో నిండిపోయిందట. మరి భారత్ అంటే ఇండియానా.. లేక సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ లో కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయని అర్థమా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఈ ఫోటోలో ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న ఒక అందమైన గౌన్ వేసుకొని అంతకంటే అందంగా నవ్వింది. ఇంత అందంగా ఉంటుంది కాబట్టే అప్పట్లో సల్లూ భాయ్ ఆమెకు పడిపోయాడు.. కాకపోతే మళ్ళీ కాస్త తేరుకొని లేచాడు.. సింగిల్ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నాడు. భాయ్ ప్లేసులో మనలాంటి వాళ్ళు అయి ఉంటే పర్మనెంట్ గా పడడమే… లేచేది ఉండదు!
Please Read Disclaimer