బురదలో కత్రినా కైఫ్

0katrina-kaif-in-fantamబాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ త్వరలో ఓ కొత్త రూపంలో కనిపించనున్నది. ఇప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం అయిన కత్రినా ‘ఫాంటమ్’ యాక్షన్ సినిమాలో వైవిధ్యమైన రూపంలో కనిపించనున్నది.

కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ సరసన నటిస్తుంది. ఈమేరకు కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. ఈ ఫోటోలలో కత్రినా సైఫ్ ఇద్దరూ బురదలో నల్లటి మసితో ఉంది ఆశ్చర్యపరుస్తున్నారు. లెబనాన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో కత్రినా కైఫ్ తన విలక్షణమైన రూపంలో ఫోటోలు తీయించుకోవటాని ఆసక్తి చూపిస్తున్నారని కబీర్ ఖాన్ చెప్పారు.

మొదట సినిమాకి దనియల్ ఖాన్ అని పేరు నిర్ణయించారు. కానీ కబీర్ ఖాన్ చివరికి ఫాంటమ్ అనే పేరు స్థిరపరిచారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది.