కత్రినా మూడ్ అలా ఉంది

0బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన కెరీర్ ను మళ్లీ బాగానే సానబెట్టుకుంది. రణబీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత దాదాపు క్లోజింగ్ వచ్చేసిందేమో అనిపించిన కత్రినా కెరీర్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. గతేడాది టైగర్ జిందా హై అంటూ పెద్ద హిట్ నే సాధించిన ఈ భామ.. ఇప్పుడు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ అమరీ ఖాన్ తోను.. జీరో అంటూ షారూక్ తోను కూడా నటించేస్తోంది.

మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిన ఈ యూకే బ్యూటీకి.. ఆ ఉత్సాహం కళ్లలోనే కనిపిస్తోంది. ఎక్కడైనా సరే తెగ జోష్ చూపించేస్తున్న కేట్.. సోషల్ మీడియాలో మరీ క్రేజీగా మారిపోయింది. రీసెంట్ గా ఈ సుందరి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అమ్మడి మూడ్ పక్కాగా అర్ధం అవుతుంది. వైట్ టాప్.. బ్లూ బాటమ్.. నిండుగా ఉన్న సింపుల్ వేర్ లోనే ఉన్నా అందాల ఎగ్జిబిషన్ విషయంలో అమ్మడి ట్యాలెంట్ బాగానే అర్ధం అవుతుంది. మొహాన్ని దాదాపుగా కప్పేస్తున్న జుట్టు.. మరింతగా అందాన్ని తెచ్చిపెట్టేసింది.

ఈ ఫోటోకు తనే మూడ్ అంటూ ఓ క్యాప్షన్ కూడా తగిలించుకుంది కత్రినా కైఫ్. ఇంతకీ ఏం మూడ్ అనే క్వశ్చన్ మనం అడక్కూడదు లెండి. ఎందుకంటే ఆ భామ కూడా చెప్పదు కదా. ఈ ఫోటోలో గమనించాల్సిన మరో పాయింట్ అమ్మడి ఫిట్నెస్. బాడీ మెయింటెనెన్స్ విషయంలో తను ఎంత పర్ఫెక్టుగా ఉంటుందో ఈ సెమీ ట్రాన్సపరెంట్ వేర్ లో బాగానే ఎగ్జిబిట్ చేసిన కత్రినా.. కత్తిలాంటి పోజుతో మతి పోగొట్టేస్తోంది.