కత్రినా పుష్ ఆప్స్ చూసి నవ్వాల్సిందే

0సెక్సీ బ్యూటి కత్రినా కైఫ్ ఇప్పుడు తన మాజీ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. ఆ షూటింగ్ లొకేషన్ లో ఈ సుందరి చేసిన తమాషా ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అమ్మడు కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటి వీడియోలతో భలే ఎంటర్టయిన్ చేస్తోందిలే.

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘టైగర్ జిందాహై’లో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం మొరాకోలో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ షూటింగ్ టైమ్ లో చిన్న విరామం దొరికినప్పుడు కత్రినా కొన్ని పుష్ అప్స్ చేసింది. ముందు మామూలుగానే పుష్ అప్స్ తీసింది అలా కొన్ని తీసిన తరువాత ఒంటి చేతితో తీయడం మొదలుపెట్టింది. ఇలా తీస్తున్న కత్రినా కైఫ్ ను చూసిన అభిమానులు ప్రేరణ పొంది వాళ్ళు కూడ అలా కష్టపడలి అనే ఆలోచన వచ్చే లోపే అసలు చేతులు లేకుండానే కిందకు పైకీ లేవడం మొదలెట్టింది. ఎక్కడో తేడా ఉంది అని చూసేవాళ్ళకి అనుమానం వచ్చేసరికి ఆమె ఒక బల్ల పై పడుకొని ఉంది. ఇంతవరకు ఆ బల్లను వేరే వాళ్ళ వెనక నుండి కిందకు పైకి కదుపుతున్నారు. ముందు మాత్రం తానే చేస్తునట్లు తెగ నటించిన కత్రినా చివరిలో కెమెరా అసలు విషయం చూపేసరికి అందరూ చిన్న గిలిగింత పెట్టినట్లు నవ్వుకొక తప్పలేదు.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘టైగర్ జిందాహై’ సినిమా నిర్మాణం మొదలైంది. ఈ సినిమా కోసం కొన్నేళ్ళు తరువాత మళ్ళీ సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. ఏక్ థా టైగర్ సినిమాకు ఇది సిక్వల్ గా రాబోతుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.