సల్మాన్-కత్రినా కైఫ్ హాట్ పిక్

0Katrina-Kaif-Shares-Pic-With-Salman-Khanబాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇలా జర్నీ ప్రారంభించిందో లేదో మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఏర్పడిపోయారు. గతేడాది జూలైలో ఫేస్ బుక్ ప్రయాణం ఆరంభించిన బాలీవుడ్ కత్తి.. ఇప్పుడు ఇన్ స్టాలో తెగ రెచ్చిపోతోంది.

కత్రినా కైఫ్ షేర్ చేసే ఫోటోలన్నీ తెగ ఇంటెన్సిటీతో కూడినవి అయి ఉంటున్నాయి. అందుకే కేట్ ఫోటోల కోసం ఫాలోయర్స్ తెగ ఆత్రంగా ఎదురుచూసేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎవరినీ నిరాశపరచకుండా కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ తెగ క్రేజ్ పెంచేసుకుంటోంది కేట్. తాజాగా ఈమె షేర్ చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయిపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి తను దిగిన ఓ పిక్ ను అభిమానులతో పంచుకుంది కేట్. అయితే.. సల్మాన్ కేవలం చిన్నపాటి నిక్కర్ తో కూర్చుని కండలను చూపిస్తుండగా.. మినీ వేసుకుని మేకప్ కూడా లేకుండా జుట్టు విరబోసుకున్న కత్రినా కైఫ్ ఈ ఫోటోలో కనిపిస్తుంది.

ఇదేమీ కొత్త ఫోటో కాదు. ఎవరూ చూడని ఓ పాత ఫోటోని కొత్తగా జనాలకు చూపించింది కేట్. బహుశా అప్పట్లో వీరిద్దరి మధ్య బోలెడంత రిలేషన్ అని జనాలు అనుకున్న టైంలోది అయుండచ్చు. ఇప్పుడు ఆ ఫోటోను పంచుకోవడంలో కేట్ ఉద్దేశ్యమేంటో చెప్పలేం కానీ.. ఈ పిక్చర్ మాత్రం వైరల్ అయిపోతోంది. అభిమానులు పెట్టుకున్న ఆశలను కత్రినా ఏమాత్రం వమ్ము చేయడం లేదు.