కత్రినా చాలా కాస్ట్ లీ గురూ..

0బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ముందుండే పేరు కత్రినాదే. ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరకుండా బ్యూటీని మెయిన్ టెయిన్ చేయడంతోపాటు సాంగుల్లో అదరగొట్టే స్టెప్పులతో అభిమాను అలరిస్తోంది. దీనికితోడు మ్యూజికల్ గానూ హిట్ అయిన చాలా పాటల్లో కత్రినా స్టెప్పులు ఆ పాటలకు మరింత ఊపు తెచ్చాయి.

కత్రినా వెండితెరపైనే కాదు.. అప్పుడప్పుడు ఈవెంట్లలోనూ స్టెప్పులేస్తూ ఉత్సాహపరుస్తుంది. కాకుంటే అదంతా ఉచిత సేవేమీ కాదు. దానికి కత్రినా అడిగిన మొత్తం ముట్టజెప్పాల్సిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నలుగురు హీరోయిన్లతో ఆడి పాడేందుకు యూఎస్ బయలుదేరి వెళ్లిపోతున్నారు. వీరంతా వెళ్తున్నాడు. సల్మాన్ తో వెళ్లే భామల్లో కత్రినా కైఫ్ – జాక్వెలైన్ ఫెర్నాండెజ్ – సోనాక్షి సిన్హా – డైసీ షా ఉన్నారు. ద-బాంగ్: ద టూర్ రీలోడ్ పేరుతో ఎనిమిది రోజుల పాటు జరిగే మేజర్ ఈవెంట్లో తమ స్టెప్పులతో సందడి చేయనున్నారు.

వీళ్లలో సల్మాన్ ఖాన్ తరవాత అందరికన్నా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే కత్రినాయే. ఈమెకు దాదాపు రూ. 12 కోట్ల వరకు ముట్టజెబుతున్నారట. తరవాత సోనాక్షికి రూ. 8 కోట్లు.. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కు రూ. 6 కోట్లు మాత్రమే చెల్లించనున్నారు. కత్రినా ఇంత మొత్తం ఎందుకు ఇస్తున్నారని ఆర్గనైజర్లను ప్రశ్నిస్తే ప్రస్తుతం హీరోయిన్లలో కత్రినాయే పెద్ద స్టార్ అంటున్నారు. ఫైనల్ డేలో ఆమె సాంగే హైలైట్ గా నిలుస్తుందని.. అందుకే అంత భారీ మొత్తం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.