సోది చెప్పమంటే కత్రినా తరువాతే

0Katrina-Kaif-Not-Workingఇప్పుడు బాలీవుడ్ లో నెక్ట్స్ బిగ్ సినిమా ఏది అంటే.. సల్మాన్ ఖాన్ ట్యూబులైట్ కూడా ఫెయిల్ అయ్యింది కాబట్టి.. జనాలు సాధారణంగానే రణబీర్ కపూర్ అండ్ కత్రినా కైఫ్ ల సినిమా ”జగ్గా జస్సూస్”వైపు చూస్తున్నారు. ఆ తరువాత ఆగస్టు 4న షారూఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మలా ”జబ్ హ్యారీ మెట్ సెజాల్” సినిమా వస్తోంది. ఇక జగ్గా జస్సూస్ కోసం కత్రినా అండ్ రణబీర్ లు మామూలు హడావుడి చేయట్లేదు.

అప్పట్లో రణబీర్ తో బ్రేకప్ అయ్యాక.. అసలు ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు అనురాగ్ బసూకు చుక్కలు చూపించింది కత్రినా కైఫ్. కాకపోతే సినిమాలో డిస్నీ వారు కూడా ప్రొడ్యూసర్లు కావడంతో.. వారు కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటే కత్రినా కెరియర్ కు చరమగీతం పాడేయాల్సి ఉంటుంది కాబట్టి.. అమ్మడు కామ్ గా షూటింగులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి.. రణబీర్ పై నానా సెటైర్లు వేస్తూ ఉంటుంది. నీతో పనిచేయడమే పెద్ద తలనొప్పి అంటూ కూడా నవ్వుతూ చెప్పేసింది. వీరు బ్రేకప్ అయ్యారు కాబట్టి.. తప్పు రణబీర్ దే అనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి.. కత్రినా ఏం చెప్పినా కూడా.. ‘పాపం పిల్లా’ అంటూ జనాలు కూడా జాలి చూపించారు.

కాని కత్రినా మాత్రం.. ఈ సినిమాలోని రోల్ గురించి చెప్పమ్మా అంటే.. ”జర్నలిస్టుగా కనిపించడానికి.. ఏకంగా 100 గంటలపాటు నేను టివి చూస్తూనే ఉన్నాను. ఒకేసారి కాకపోయినా.. దాదాపు 100 గంటల సమయం జర్నలిస్టులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించిందట కత్రినా. వినడానికే ఒక రేంజు సోదిలా ఉంది కదూ. మామూలుగా బయట జర్నలిస్టులకు ఎప్పుడూ పొగరు సమాధానాలు చెప్పే కత్రినా.. సల్మాన్ అండతో సల్మాన్ తరహాలోనే బిహేవ్ చేసే కత్రినా.. జర్నలిస్టులను స్టడీ చేసింది అంటే.. అది రియల్ లైఫ్ లో కాకుండా అలా టివి చూసి అంటే.. వాటే కామెడీ గురూ!!