కత్రినా కైఫ్ కొత్త అవతారం

0katrina-kaif-sistersబాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. అక్కడి టాప్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది కానీ.. అమ్మడి జోరు మాత్రం తగ్గలేదు. చేతిలో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు ఉండడంతో.. అమ్మడు మరోసారి పుంజుకునే అవకాసాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇటు టాప్ బ్యూటీగా తన స్టేటస్ కంటిన్యూ చేస్తూనే.. మరో యాంగిల్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఈ బార్బీ డాల్. ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తబోతోందిట కేట్. ఇందులో కమర్షియల్ యాంగిల్ తో పాటు.. పర్సనల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయిలే. తన చెల్లెళ్లు ఇద్దరినీ కూడా హీరోయిన్స్ చేసేయాలన్నది అమ్మడి చిరకాల కోరిక. ఇసాబెల్.. సోనియాలు ఇద్దరినీ హీరోయిన్స్ చేసేసి.. తన కెరీర్ చివరి దశకు వచ్చాక కూడా.. ఇంకా వెలిగిపోవాలన్నది కేట్ ఆలోచన.

ఇందుకోసం సల్మాన్ ఖాన్ ను సాయం అడిగింది. ఈ విషయంలో కేట్ కు సాయం చేసేందుకు సల్లూభాయ్ సిద్ధమే కానీ.. ప్రొడక్షన్ మాత్రం తన వల్ల కాదనేశాడట. అందుకే వారిని హీరోయిన్స్ గా ప్రమోట్ చేసేందుకు.. తనే సినిమాలు తీసేయాలని డిసైడ్ అయిపోయిందట కత్రినా. ఇంకా ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాకపోయినా.. తాను సినిమా తీయడం మాత్రం ఖాయం అంటోంది బార్బీడాల్ కత్రినా కైఫ్. కేట్ చెల్లెలు ఇసాబెల్ 2014లో వచ్చి డా.క్యాబీ అనే మూవీతో అరంగేట్రం చేసేసింది.