హాటెస్ట్ ఫీమేల్ ఫిలింమేకర్స్

0

ముఖానికి రంగేసుకుని పెద్ద తెర కోసం నటించడమే కాదు… తెరవెనక ఉండి కాసుల గలగలల్ని కురిపించే సినిమాలు నిర్మించడం తమకు తెలుసని నిరూపిస్తున్నారు కొందరు అగ్ర కథానాయికలు. సొంతంగా నిర్మాణ సంస్థలు ప్రారంభించి అందులో పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ వద్ద కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు భామలు. ఇక ఈ రేస్ లోకి మరికొందరు భామలు ఎంట్రీ ఇస్తూ వేడి పెంచుతున్నారు. ఓసారి బాలీవుడ్ లో ఈ తరహా ఎవరెవరు ఉన్నారు? అన్నది పరిశీలిస్తే..

ఇప్పటికే జూహీ చావ్లా- పూజా భట్- ప్రియాంక చోప్రా- లారా దత్తా- దియా మీర్జా- శిల్పా శెట్టి- మలైకా అరోరాఖాన్ లాంటి నాయికలు సినీనిర్మాతలుగా పాపులరయ్యారు. కొందరు వరుసగా సినిమాలు నిర్మిస్తే.. మరికొందరు నిర్మాణ భాగస్వాములుగా కొనసాగారు. అది కాస్త పాత తరం అనుకుంటే నవతరంలో అనుష్క శర్మ ఓ ట్రెండ్ సెట్టర్. అనుష్క శర్మ.. దీపిక పదుకొనే లాంటి అందాల కథానాయికలు సినిమాల నిర్మాతలుగా… నిర్మాణ భాగస్వాములుగా పాపులరయ్యారు. అనుష్క శర్మ ఇప్పటికే వరుసగా బ్లాక్ బస్టర్లు తెరకెక్కించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. దీపిక పదుకొనే తాజాగా మేఘనా గుల్జార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చపాక్ చిత్రంతో సినీనిర్మాణంలో అడుగుపెట్టడం ఆసక్తికరం. ఈ సినిమాలో దీపిక యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటిస్తున్నారు. అందాల నాయిక చిత్రాంగద సింగ్ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ బయోపిక్ ని నిర్మించారు. వరుసగా సినిమాల నిర్మాణంపైనా దృష్టి సారిస్తున్నారు

వీళ్లందరి బాటలోనే అందాల కథానాయిక కత్రిన కైఫ్ సైతం సినీనిర్మాణంలో అడుగుపెడుతుండడం ఆసక్తికరం. త్వరలోనే కంటెంట్ బేస్డ్ సినిమాల్ని నిర్మించాలని ఉందని కత్రిన స్వయంగా ముంబైలోని ఓ ఈవెంట్ లో ప్రకటించారు. వూట్ – ఫీట్ అప్ విత్ ది స్టార్స్ సీజన్ 2 కార్యక్రమంలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను నిర్మాతను అవుతున్నానని.. కంటెంట్ డెవలప్ చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాసెస్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉందని కత్రిన అన్నారు. ఫిలింమేకర్ గా తన పరిధిని మరింత విస్తరించే ఆలోచన ఉందని తెలిపారు. ఎలానూ కత్రిన నిర్మాత అవుతోంది కాబట్టి తన సిస్టర్ ఇసబెల్లా కైఫ్ కి ఇందులో అవకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇకపోతే కత్రిన నటించిన భారత్ ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కుముద్ రైనా అనే పాత్రలో నటించింది. సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వ ం వహించారు.

ఇక లేడీ నిర్మాతల్లో పలువురు పాపులర్ పర్సనాలిటీస్ ఉన్న సంగతి తెలిసిందే. జోయా అక్తర్ – ఏక్తా కపూర్ – ఫరా ఖాన్ – గౌరీ ఖాన్ – గునీత్ మోంగా – షరీన్ మంత్రి.. క్రై అర్జ్ వంటి వాళ్లు బాలీవుడ్ లో క్రేజీ నిర్మాతలుగా కొనసాగుతున్నారు. బాలాజీ టెలీ ఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ యూనిక్ డేరింగ్ స్టైల్ గురించి తెలిసిందే.
Please Read Disclaimer