‘జీరో’ లుక్ లో షాకిచ్చిన కత్రినా..

0షారుఖ్ ఖాన్ మరో కొత్త పాత్రతో మనముందుకు వస్తున్నాడు.. మురుగుజ్జుగా నటిస్తున్నాడు. ‘జీరో’ పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్. అనుష్క మానసిక రోగిపాత్రలో నటిస్తోంది. అజయ్ -అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను షారుఖ్ భార్య గౌరీఖాన్ -ఆనంద్ ఎల్ రాయ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

షారుఖ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘జీరో’ కత్రినా కైఫ్ కు ఊహించని పాత్ర దక్కిందట. ఓ సూపర్ స్టార్ పాత్రను పోషించిందట.. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ఇందులో భాగంగా బర్త్ డే సందర్భంగా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్లకు దట్టంగా కాటుక పెట్టుకొని వినూత్నంగా కనిపించింది. జీరో సైజ్ లో మత్తెక్కించేలా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.