రవితేజ హిందీ సినిమా టైటిల్….’కౌర్ అండ్ సింగ్’!

0

kaur-and-singhవరుస ప్లాపులతో రవితేజ పనైపోయిందనుకున్న తరుణంలో ‘బలుపు’ సినిమా హిట్‌తో రవితేజ ఊపిరిపీల్చుకున్నాడు. రవితేజ ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నాడు. వరుస ప్లాపులతో షాక్ తిన్న రవితేజ ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి బలుపు సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు రవితేజ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రవితేజ బాలీవుడ్ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఇందుకు దర్శకుడు, స్క్రిప్ట్ కూడా రెడీ చెసుకున్నాడు. రవితేజను హిందీ చిత్ర రంగానికి పరిచయం చేసే అవకాశాన్ని బాలీవుడ్ దర్శకుడు సమీర్ కార్నిక్ సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం ఆద్యంతం కామెడీగా సాగే కథతో కూడిన స్క్రిప్టును కూడా ఆయన తయారుచేసుకున్నట్లు సమాచారం.

హిందీ, తెలుగు భాషల్లో ఇది ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడు. హిందీలో ‘కౌర్ అండ్ సింగ్’ టైటిల్‌ను, తెలుగులో ‘లక్ష్మి రెడ్డి’ టైటిల్‌ను నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమా ప్రపోజల్‌తో హైదరాబాదు వచ్చిన దర్శకుడు సమీర్… రవితేజను కలిసి ప్రాజక్టు ఓకే చేసుకున్నాడని సినీవర్గాల సమాచారం.

kaur and singh, రవితేజ హిందీ సినిమా టైటిల్….’కౌర్ అండ్ సింగ్’!, Raviteja kaur and singh movie, kaur and singh hindi movie,