బిగ్ బాస్ ను శాసించిన ‘కౌశల్ ఆర్మీ’!

0

బిగ్ బాస్ -2 ఫాలో అవుతున్న వారికి కౌశల్ కు మద్దతుగా ఏర్పడిన `కౌశల్ ఆర్మీ`గురించి పరిచయం అక్కరలేదు. హౌస్ లో అందరు కంటెస్టెంట్లకు అభిమానులుండడం సహజం. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా ఓ కొత్త ఒరవడికి కౌశల్ అభిమానులు శ్రీకారం చుట్టారు. బిగ్ బాస్ -2 లో ఒన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కౌశల్ కు మద్దతుగా ఏర్పడిన `కౌశల్ ఆర్మీ`….ఇంతింతై వటుడింతై అన్నట్లు క్రమక్రమంగా బలపడుతూ షో ను శాసించే స్థాయికి ఎదిగింది. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ యాక్టివ్ గా ఉంటూ కౌశల్ కు ఓట్లు వేస్తూ..వేయిస్తూ…పవర్ ఫుల్ గా తయారైంది. ఏకంగా హైదరాబాద్ లో `కౌశల్ ఆర్మీ 2కె`నిర్వహించింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఓ కంటెస్టెంట్ కు మద్దతుగా 2కే రన్ నిర్వహించడం ….కౌశల్ ఆర్మీకే చెల్లింది. కౌశల్ తో గొడవపడ్డ.. కిరీటి – భాను శ్రీ – బాబు గోగినేని – దీప్తి సునయన – తేజస్వి – గణేష్ – నందిని ఎలిమినేట్ అయ్యారంటే కౌశల్ కు ఎంత మద్దతుందో తెలిసిపోతుంది.

హోస్ట్ నానిని కూడా `కౌశల్ ఆర్మీ` భయపెట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ లు వచ్చాయి. అందరు కంటెస్టంట్లకు క్లాస్ పీకిన నాని ….కౌశల్ ను మాత్రం టార్గెట్ చేయలేదని విమర్శలు వచ్చాయి. రెండు వారాల క్రితం మాత్రం….లైట్ గా కౌశల్ పై నాని చిరుకోపం ప్రదర్శించాడు. ఓ రకంగా చెప్పాలంటే షో ను `కౌశల్ ఆర్మీ` హైజాక్ చేసింది. కౌశల్ కు విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న సంగతి …అందరు కంటెస్టెంట్లకు తెలిసిపోయింది. రీ ఎంట్రీ ఇచ్చిన వారు….లీకులందించారు. దీంతో కౌశల్ ను టార్గెట్ చేయాలని మిగతా కంటెస్టెంట్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే షోను కౌశల్ ఆర్మీ శాసించింది. కౌశల్ ను విజేతగా ప్రేక్షకులు కూడా ఫిక్సయ్యేలా చేసింది. కౌశల్ తో పాటు గీతా – దీప్తి నలమోతు కూడా విన్నర్ బరిలో ఉన్నారు. వారి వెనుక కౌశల్ ఆర్మీ వంటి బలమైన ఫ్యాన్ బేస్ లేకపోవడం….కౌశల్ ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపింది. తమకు నచ్చని కంటెస్టెంట్ లను కౌశల్ ఆర్మీ ఎలిమినేట్ చేయించింది. షో కు బజ్ తీసుకువచ్చిన కౌశల్ ఆర్మీ …కౌశల్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయేలా హైప్ క్రియేట్ చేశారు. ఏది ఏమైనా….షో కు ముందు చాలామందికి పరిచయంలేని కౌశల్ కు ఓ స్టార్ స్టేటస్ తెప్పించిన ఘనత కౌశల్ ఆర్మీకే దక్కుతుంది. ఈ సారి షోను విన్నర్ ను శాసించిన `కౌశల్ ఆర్మీ`గ్రేట్ అని…..అసలు బిగ్ బాస్ `కౌశల్ ఆర్మీ`నే అని చెప్పక తప్పదు.
Please Read Disclaimer