కౌశల్ మూవీ కోసం మళ్లీ రంగంలోకి ఆర్మీ!

0

Kaushal-Army-Planning-Crowd-Funded-Movie-witth-Kaushalకౌశల్ ఆర్మీ తీవ్రంగా శ్రమించి మరీ బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ ను విజేతగా చేశారు. సీజన్ ప్రారంభం అయిన రెండు మూడు వారాల్లోనే కౌశల్ ఆర్మీ ఫార్మ్ అయిన విషయం తెల్సిందే. కౌశల్ ఆర్మీ ఎప్పుడైతే ఏర్పాటు అయ్యిందో అప్పటి నుండి కూడా బిగ్ బాస్ గురించి చర్చ ఎక్కువ అయ్యింది. కౌశల్ ఆర్మీ ఏం చెబితే అది ఎలా చెబితే అలా అన్నట్లుగా షో నడిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్ ను ఇబ్బంది పెడుతూ వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ చివరకు కౌశల్ ను విజేతగా నిలపడంలో కౌశల్ ఆర్మీ సఫలం అయ్యింది. ఇప్పుడు కౌశల్ ను హీరోగా చేసేందుకు కౌశల్ ఆర్మీ మరోసారి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కౌశల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన కౌశల్ బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో విలన్ గా నటించాడు. ఇక ఇప్పుడు కౌశల్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరికను తీర్చుతాను అంటూ ఇప్పటికే కౌశల్ ప్రకటించాడు. మంచి దర్శకుడు మంచి నిర్మాత వస్తే తప్పకుండా సినిమాను చేస్తాను అంటూ ప్రకటించిన కౌశల్ కు నిర్మాతలుగా మేం వ్యవహరిస్తాం అంటూ కౌశల్ ఆర్మీ ముందుకు వచ్చిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతుంది.

ఎక్కువ మంది ఆర్థిక సాయంతో – పెట్టుబడితో నిర్మాణం జరిగిన సినిమాను క్రౌండ్ ఫండ్డింగ్ మూవీ అంటారు. ఎవరికి తోచినంతగా వారు పెడతారు. వారి డబ్బుకు తగ్గట్లుగా షేర్ ఉంటుంది. కౌశల్ హీరోగా 4 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించేందుకు ఆయన అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం పదుల సంఖ్యలో అభిమానులు ఫండ్ ను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈమద్య ‘మను’ అనే క్రౌడ్ ఫడ్డింగ్ మూవీ వచ్చింది. మరో రెండు మూడు కూడా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే కౌశల్ ఆర్మీ కూడా ఇలా కౌశల్ అభిమానులు కూడా సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మంచి కథ దర్శకుడు సిద్దం అయితే కౌశల్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. త్వరలోనే ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కౌశల్ ఆర్మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer