‘బిగ్ బాస్-2’ సెట్ దగ్గర కౌశల్ ఆర్మీ రభస?

0

గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిగ్ బాస్ రియాల్టీ షో మంచి విజయవంతమైంది. అదే ఊపుతో…..సరిగ్గా 110 రోజుల క్రితం మొదలైన బిగ్ బాస్ సీజన్-2 నేటితో ముగియనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి షో చాలా భిన్నంగా సాగింది. హోస్ట్ నాని ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అని చెప్పినట్లు…అనూహ్యమైన ట్విస్టులతో …షో సాగింది. బిగ్ బాస్ -2 లో ఒన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కౌశల్ కు మద్దతుగా ఏర్పడిన `కౌశల్ ఆర్మీ`….ఏకంగా హైదరాబాద్ లో `కౌశల్ ఆర్మీ 2కె`నిర్వహించింది. దుబాయ్ లో ఆసియా కప్ సందర్భంగా కూఆ కౌశల్ కు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు సోషల్ మీడియాకు పరిమితమైన కౌశల్ ఆర్మీ….శనివారం రాత్రి ఏకంగా అన్నపూర్ణలోని బిగ్ బాస్ సెట్ బయట హల్ చల్ చేశారు. 300 మంది కౌశల్ ఆర్మీ సభ్యులు …. ఫైనల్ షూట్ కు ముందు కౌశల్ కు మద్దతుగా నినాదాలు చేయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు షూటింగ్ నిలిపివేశారట.

ఆదివారం సాయంత్ర ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలె షో ఎపిసోడ్ షూటింగ్ శనివారం రాత్రి ప్లాన్ చేశారు. కానీ దాదాపు 300 మంది కౌశల్ అభిమానులు బిగ్ బాస్ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకుని…. కౌశల్ కు మద్దతుగా నినాదాలు చేశారని తెలుస్తోందా. కౌశల్ ….అంటూ పెద్దగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గోడలకు కౌశల్ విన్నర్ అంటూ పోస్టర్లు కూడా అంటించారట. దీంతో శనివారం రాత్రి షూటింగ్ ఆపివేసి….ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారట. శనివారం రాత్రి కౌశల్ అభిమానుల అత్యుత్సాహం నేపథ్యంలో నేడు అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారట. మరోవైపు ఇప్పటికే కౌశల్ విన్నర్ అంటూ కౌశల్ ఆర్మీతో పాటు కొంత మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత – నటుడు అభి తన ఫేస్ బుక్ ఖాతాలో కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్కు కౌశల్ తో పాటు గీతా మాధురి – దీప్తీలు చేరినట్లు సమాచారం. మరి అసలు విన్నర్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.




Please Read Disclaimer