కౌశల్ స్టార్ అయ్యాడనేందుకు మరో సాక్షం

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కు అనూహ్యంగా స్టార్ ఇమేజ్ దక్కిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ కు ముందు వరకు కొంత మందికి మాత్రమే తెలిసిన కౌశల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు తెలిసి పోయింది. కౌశల్ ఏ స్థాయిలో బిగ్ బాస్ తో గుర్తింపు దక్కించుకున్నాడో సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. కౌశల్ ఆర్మీ ఎంతగా ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారో కూడా తెలిసిందే. అయితే కొందరు మాత్రం కౌశల్ అభిమానులను ఫేక్ అని – స్టార్ డం ఆయనకు ఆయన సృష్టించుకున్నదే అంటూ విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఆ విమర్శలకు ఆయన అభిమానులు సమాధానం ఇచ్చారు. తాజాగా కౌశల్ కే ఎల్ ఎమ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లాడు. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు స్టార్ హీరోయిన్స్ లేదంటే హీరోలు మాత్రమే వెళ్తారు. కాని అనూహ్యంగా కౌశల్ ను షాపింగ్ మాల్ వారు ఆహ్వానించారు. కౌశల్ వస్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం జనాలు వచ్చే అవకాశం లేదని నిర్వాహకులు ఏర్పాట్లు మామూలుగానే చేశారు. కాని కౌశల్ వస్తున్న విషయం తెలిసిన జనాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

షాపింగ్ మాల్ నిర్వాహకులకు జనాలను అదుపు చేయడం పెద్ద పనైంది. పలువురు పోలీసులు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చినా కూడా జనలను అదుపు చేయలేక పోయినట్లుగా తెలుస్తోంది. కౌశల్ ను చూసేందుకు అక్కడకు వచ్చిన జనాలను చూసి సినీ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు. కౌశల్ కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ఆయన ఇప్పుడు ఎంత పెద్ద స్టారో ఈ జనాలను చూసి అర్థం చేసుకోవచ్చు అంటూ కౌశల్ ఆర్మీ మెంబర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Please Read Disclaimer