యూట్యూబ్ స్టార్ పై కౌశల్ ఆర్మీ ఎటాక్!

0బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అన్న సంగతి ఒక రోజు ముందుగానే లీక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ ను ఒక రోజు ముందుగానే షూట్ చేస్తున్న నేపథ్యంలో శనివారం నాటికి సోషల్ మీడియాలో ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు చక్కర్లు కొడుతోంది. అయితే దాంతోపాటు కౌశల్ తో గొడవ పడ్డ ప్రతి కంటెస్టెంట్ దాదాపుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఫైనలిస్టులలో ఒకడిగా అంచనాలున్న కౌశల్ కు కౌశల్ ఆర్మీ నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఆదివారం యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన ఎలిమినేట్ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి.

కొద్ది వారాలనుంచి కౌశల్ ఆర్మీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. కౌశల్ తో గొడవపడ్డ వారిని …కౌశల్ ఆర్మీ విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గత రెండురోజులుగా దీప్తి సునయనపై కౌశల్ ఆర్మీ దాడి చేస్తోంది. టెలీకాలర్ …పబ్లిక్ కాలర్ టాస్క్ లో కౌశల్ పై దీప్తి నోరుపారేసుకుంది. ముందు నుంచి కౌశల్ పై గుర్రుగా ఉన్న దీప్తి సునయన….ఆ టాస్క్ సందర్భంగా ఓపెన్ అయింది. కౌశల్ ప్రవర్తనను చూసి…జనం ఉమ్మేస్తారని దీప్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో దీప్తిని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. కొద్ది వారాల నుంచి ఎలిమినేషన్ జోన్ లో ఉన్న దీప్తి…తాజాగా కౌశల్ ఆర్మీ టార్గెట్ కావడంతో ఆమె ఎలిమినేషన్ ఖాయమని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. మరి దీప్తి ఎలిమినేట్ అవుతుందో లేదో చూడాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు.