మహేష్ కు క్రెడిట్ ఇచ్చిన కౌశల్

0

Kaushal-Gives-Bigg-Boss-title-Credit-to-Mahesh-Babuతెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రేజీ సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పటికే అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ కు భారీగా మద్దతు అందిస్తున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు అభిమానులనుండి – ప్రేక్షకులనుండి కౌశల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కౌశల్ ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నాడు.

“నేను ఈ స్థాయి కి చేరాడానికి చాలామంది నాకు సహాయం చేశారు. వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. బిగ్ బాస్ లో ఇలా నేను పాల్గొన్నాను అంటే దానికి కారణం మహేష్ బాబు గారు నా కెరీర్ మొదట్లో అందించిన ప్రోత్సాహం. మహేష్ తన డెబ్యూ ఫిలిం ‘రాజకుమారుడు’ షూటింగ్ సమయంలో నన్ను మోడలింగ్ ఏజెన్సీ ని ప్రారంభించమని ప్రోత్సహించారు. హైదరాబాద్ లో మోడలింగ్ ఏజెన్సీ ప్రారంభించిన మొదటి వ్యక్తిని నేనే. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గారు కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మోడలింగ్ ఏజెన్సీ కనక పెట్టి ఉండకపోతే నేనెప్పుడో నా స్వస్థలం వైజాగ్ కు వెళ్లిపోయి ఉండేవాడిని.” అన్నాడు.

‘రాజకుమారుడు’ సమయం నుండే మహేష్ బాబు గారితో పరిచయం ఉందని.. ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపాడు. కౌశల్ తన అమ్మగారిని క్యాన్సర్ కారణంగా పోగొట్టుకున్నానని.. అందుకే తన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కు ఖర్చు పెడతానని తెలిపాడు.
Please Read Disclaimer