కౌశల్ సెంటిమెంట్ మరోసారి ఫ్రూవ్ అయ్యిందిగా!

0ఏమైనా జరగొచ్చన్న ట్యాగ్ తో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2లో మిగిలిన విషయాల్లో ఏమైనా జరగొచ్చు కానీ.. కౌశల్ తో పెట్టుకున్నోళ్లు బిగ్ బాస్ హ\స్ నుంచి మాత్రం బయటకు వెళ్లిపోతారన్న సెంటిమెంట్ మాత్రం పక్కాగా వర్క్ వుట్ కావటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే పలువురు హౌస్ మేట్స్.. కౌశల్ తో పెట్టుకున్న వెంటనే.. హౌస్ నుంచి ఎలిమినేట్ కావటంతో.. కౌశల్ తో పెట్టుకున్నోళ్లు ఎవరూ బిగ్ బాస్ హౌస్ లో నిలవరన్న మాట అంతకంతకూ నిజమవుతోంది. తాజాగా.. అలాంటిదే మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ వారం బిగ్ బాస్ పిట్టగా ముద్దుగా పిలుచుకునే దీప్తి సునయిన ఎలిమినేట్ అయ్యింది.

ఆమె ఎలిమినేషన్ లో కౌశల్ తో పెట్టుకోవటమే కారణంగా విశ్లేషిస్తున్న వారు లేకపోలేదు. ఆమె కౌశల్ తో గొడవ పడటమే ఎగ్జిట్ కు కారణంగా చెబుతున్నారు. గత వారం కౌశల్ మీద దీప్తి తీవ్ర వ్యాఖ్యలు చేయటం..తాజాగా ఆమె ఎలిమినేట్ కావటం చూస్తున్నప్పుడు.. కౌశల్ తో పెట్టుకున్నోళ్లు ఎవరూ హౌస్ లో ఉండలేరన్న సెంటిమెంట్ కు మరింత బలం చేకూర్చినట్లు అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటికే కౌశల్ తో గొడవ పెట్టుకున్న కిరిటి.. భాను.. తేజస్వి.. బాబు గోగినేని ఎలిమినేట్ కావటం గమనార్హం.