వారెవ్వరు కౌశల్ కు ఇప్పటికీ కాల్ చేయలేదట!

0

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ ఫుల్ బిజీ అయ్యాడు. ఒక్కసారిగా స్టార్ డం దక్కడంతో కౌశల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. తాను ఊహించుకున్నదానికి రెట్టింపుగా కౌశల్ ఆర్మీ ఉందని ఈ స్థాయి అభిమానంను తాను ఊహించుకోలేదు అన్నాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించాడు. 113 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండి – టైటిల్ ను గెలుచుకున్న కౌశల్ కు పలువురు సినీ తారల నుండి ఇంకా ప్రముఖుల నుండి అభినందనలు దక్కాయి. కాని ఇప్పటి వరకు తన తోటి పార్టిసిపెంట్స్ నుండి మాత్రం కాల్ రాలేదట.

కౌశల్ మాట్లాడుతూ.. తాను గేమ్ పై మాత్రమే ఫోకస్ పెట్టిన కారణంగా అంతా కూడా నన్ను పక్కకు పెట్టి ఒక శత్రువులా చూశారు. నన్ను దూరం పెట్టడం వల్ల చాలా సార్లు నేను బాధ పడ్డాను. తన వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వారికి వెంటనే సారీ చెప్పడం నాకు అవాటు. అలా అందరితో నేను కలిసి పోయి ఉండాలని ప్రయత్నించినా కూడా నా ఆట తీరు కారణంగా అంతా కూడా నాకు వ్యతిరేకం అయ్యారు. నాపై ఇంకా కూడా వారికి కోపంగానే ఉందనిపిస్తుంది.

బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఇంటి సభ్యుల నుండి తనకు ఇప్పటి వరకు కాల్ రాలేదని ఏ ఒక్కరు కూడా తనను అభినందించేందుకు కాల్ చేయలేదని చెప్పుకొచ్చాడు. పార్టిసిపెంట్స్ అంతా కూడా ఈగోతోనే ఉన్నారంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వైపు కౌశల్ ఆర్మీపై వస్తున్న విమర్శలకు కూడా ఘాటుగా సమాధానం చెప్పాడు. కౌశల్ మొత్తానికి చాలా బిజీ అయ్యాడు. సినిమాల్లో కూడా ఈయనకు ఛాన్స్లు వస్తున్న కారణంగా మరింత బిజీ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
Please Read Disclaimer