ఇక నా సత్తా చూపిస్తా : కౌశల్

0

Kaushal-Sensational-Comments-on-Pawan-Kalyan-and-Mahesh-Babuబిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ బయటకు వచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కౌశల్ పాల్గొన్నాడు. ఆ తర్వాత కౌశల్ మరియు నీలిమలను కౌశల్ ఆర్మీ మెంబర్స్ సన్మానించారు. ఆ సందర్బంగా కౌశల్ మాట్లాడుతూ తాను నమ్ముకున్నదానికి కట్టుబడి ముందుకు సాగే వ్యక్తిని అని – నన్ను నమ్మి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును పర్సనల్ గా కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ఉందన్నాడు. ఈ సందర్బంగా నా కోసం ఇంత చేసిన మీకు ఏదైనా చేయాలని ఉందని మీకోసం నేను ఏం చేయాలి అంటూ అభిమానులను ప్రశ్నించిన సమయంలో వారు అంతా కూడా హీరో అవ్వాలంటూ గట్టిగా నినదించారు.

మీ కోరిక తీర్చేందుకు నేను సిద్దం. త్వరలోనే దర్శకుల అన్వేషణ ప్రారంభిస్తాను. మంచి కథతో మంచి దర్శకుడితో హీరోగా ఒక సినిమాను చేస్తాను అంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇకపై నా సత్తా చూపిస్తాను అని నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరిని కూడా నిరుత్సాహ పర్చకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అన్నాడు. కౌశల్ ఆర్మీ కేవలం నా కోసమే కాకుండా కేరళ వరద బాధితుల కోసం కూడా అండగా నిలవడం గర్వంగా ఉందన్నాడు. చనిపోయిన తర్వాత కూడా మన గురించి జనాలు మాట్లాడుకున్నప్పుడే అసలైన జీవితంను జీవించినట్లు అంటూ అమ్మ చెప్పేవారు. జీవితంలో చాలా గొప్ప విజయాన్ని దక్కించుకున్నాను అంటూ కౌశల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాకు నేను మోడలింగ్ కో ఆర్డినేటర్ గా వర్క్ చేశాను రాత్రి అంతా కూడా మోడల్స్ ను కోఆర్డినేట్ చేస్తూ ఉదయాన్నే షూటింగ్ కు రావడం గమనించిన పవన్ కళ్యాణ్ గారు నా భుజంపై తట్టి మరీ అభినందించాడు అంటూ మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ గారితో తనకు ఉన్న అనుబంధంను ఈ సందర్బంగా కౌశల్ గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి కౌశల్ బయట కౌశల్ ఆర్మీ గురించి తెలుసుకున్న తర్వాత చాలా భావోద్వేగంకు గురయ్యాడు.
Please Read Disclaimer