దీప్తికి బిగ్ బాస్ ఎండ్ కార్డ్ వేసేస్తాడా?

0వందరోజుల పాటు ఒకే ఇంట్లో … ఈ ప్రపంచంతోనే సంబంధాలు తెంపేసుకొని.. రకరకాల ఎమోషన్స్ తో సావాసం చేయడం సాహసమే. దాదాపు 70రోజుల నుంచీ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న తతంగమే ఇది. అయితే ఈ గేమ్ ను గేమ్ గా కాకుండా.. డ్రామాగా మార్చి.. దానికి కాస్తంత మసాలా యాడ్ చేసి.. రెండో సీజన్ ను పరుగులెట్టిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.. ఇప్పటివరకూ ఈ షో ఎన్నో మలుపులు తిరిగింది – మరెన్నో మెరుపులు మెరిపించింది. వారానికొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ.. అంచనాలు పెంచుకుంటూ వెళుతున్న ఈ షో నుంచి .. గత వారం దీప్తి సునయనని ప్రేక్షకులు దగ్గరుండి సాగనంపేసారు. ఇక వచ్చేవారం ఎలిమినేట్ అయ్యేది దీప్తినే కావచ్చని చర్చించుకుంటున్నారు జనం.

పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది ఇక నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ – పూజ – తనీష్ – కౌశల్ లో మరి తనీష్ – కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు కాగా.. దీప్తి – పూజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. బిగ్ బాస్ షో బిగినింగ్ నుంచీ ఎలిమినేషన్ ఫోబియో ఉన్నదీప్తి .. నామినేట్ అయిన ప్రతీ సారీ బాగా ఎమోషనల్ అయిపోతుంటుంది. ఈ సారి కూడా దీప్తి నామినేట్ అయినందుకు బాగా ఫీలైనట్టు కనిపించింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్ లోకి వచ్చింది. మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్ చేస్తారో లేదో చూడాలి. లేక బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ అని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆ ఇద్దరిలో దీప్తి చేసే చేష్టలకు అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. మరి వచ్చేవారం దీప్తి నిజంగానే ఇంటికి వెళ్లిపోతుందా లేక ఏదైనా మిరకిల్ జరిగి.. ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళుతుందా అదీ చూద్దాం..