కేసీఆర్ హుకుం : ఆంధ్రా ఉద్యోగులూ తట్టా.. బుట్టా సర్ధుకోండి!

0

KCR-warns-andhra-enployeesతెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే ఈ ప్రాంతంలో పని చేసే ఆంధ్రా ఉద్యోగులంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ టీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు శుక్రవారం హుకుం జారీ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు మాత్రమే కొత్త ప్రభుత్వంలో పని చేస్తారన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏనాడూ జోగో.. బాగో అనలేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి డిప్యూటేషన్‌పై వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయంగా పదోన్నతులు కల్పించారని తమ ప్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఇలాంటి వారందరికీ న్యాయం చేస్తారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వీటిని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఖచ్చితంగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రా ఉద్యోగులంతా తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందేనని ఇందులో ఎలాంటి మార్పు లేదని కేసీఆర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే, తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

KCR Warns Andhra Employees in Telangana, KCR Warns Andhra Employees, KCR, andhra employees, Telangana, కేసీఆర్ హుకుం : ఆంధ్రా ఉద్యోగులూ తట్టా.. బుట్టా సర్ధుకోండి!, కె చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ చీప్ కేసీఆర్, ఆంధ్రా ఉద్యోగులు, కాంగ్రెస్