రంగస్థలంలో కీరవాణి తనయుడు

0ప్రముఖ సంగీత ద‌ర్శకుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌సింహా.. దృష్టి ద‌ర్శక‌త్వంపై ప‌డింది. ఇప్పుడాయ‌న‌ ‘రంగ‌స్థలం’ చిత్రానికి స‌హాయ ద‌ర్శకుడిగా ప‌నిచేస్తున్నాడు. రాజ‌మౌళి ద‌గ్గర ప‌నిచేసే అవ‌కాశం ఉన్నా, సింహా మాత్రం సుకుమార్‌ని ఎంచుకోవ‌డం విశేషం. సుకుమార్ అంటే వున్న ఇష్టంతో రాజమౌళినే రికమెండ్ చేసి జైసింహాను రంగస్థలం సినిమాలో చేర్చాడని తెలిసింది.

బేసిగ్గా సంగీత ద‌ర్శ‌కుల త‌న‌యులు కూడా సంగీత ద‌ర్శ‌కులుగానే చ‌లామ‌ణీ అవ్వ‌డం చూస్తూనే ఉన్నాం. సాలూరి రాజేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కోటి సంగీత ద‌ర్శ‌కుడిగా మారాడు. మ‌ణిశ‌ర్మ వార‌సుడు కూడా అదే ఫీల్డులో ఉన్నాడు. ఇప్పుడు కీరవాణీ తనయుడు మాత్రం దర్శకత్వంవైపు అడుగులు వేయడం గమనార్హం.