విజయ్ కోసం తన ట్యాలెంట్ చూపిన కీర్తి

0Vijay art by keerthiకోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ బర్త్ డే నేడు . ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు ప‌లువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాక్ష‌లు తెలుపుతున్నారు. అయితే హీరోయిన్ కీర్తి సురేష్ ఓ స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసింది. విజ‌య్ కోసం స్వ‌యంగా ఓ ఆర్ట్ వేసిన హీరోయిన్ కీర్తి సురేష్‌… తాను ఒక చిన్న ఆర్ట్ వ‌ర్క్ చేశాన‌ని ఆ ఫొటోను పోస్ట్ చేసి, హ్యాపీ బ‌ర్త్ డే విజ‌య్ అని ట్వీట్ చేసింది. కీర్తి వేసిన ఈ ఆర్ట్ అభిమానులను సైతం ఆకట్టుకుటుంది.

విజయ్‌, కీర్తి సురేశ్‌ కలిసి ‘భైరవ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని ‘ఏజెంట్‌ భైరవ’ పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సావిత్రి బయోపిక్, పవన్ కళ్యాణ్ సినిమాలతో టాలీవుడ్ బిజీగా వుంది కీర్తి సురేష్.