మరోసారి సావిత్రిగా కీర్తి సురేష్

0కీర్తి సురేష్ కు ‘మహానటి’తో అదృష్టం పట్టింది. ఆమె నక్కతోకను తొక్కినట్టే కనిపిస్తోంది. మహానటిగా జీవించేసి అందరి మన్ననలు పొంది సౌత్ లోనే యమ క్రేజ్ తెచ్చుకుంది. ఏ హీరోయిన్ కు రానంత పేరు తెచ్చుకుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ కు చాలా మంచి పాత్రలు దక్కుతున్నాయట.. తాజాగా మరోసారి సావిత్రి పాత్ర చేసే అవకాశం కీర్తి సురేష్ కు లభించింది.

మహానటి సావిత్రి బయోపిక్ స్ఫూర్తితో స్టార్ హీరో నందమూరి బాలయ్య తన తండ్రి ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కథలో సావిత్రి – అక్కినేని నాగేశ్వరరావు పాత్రలు చాలా కీలకం.. ఆ రెండు పాత్రల నిడివి కూడా కాస్త ఎక్కువేనట.. ఎన్టీఆర్ కు – సావిత్రి పాత్రకు మధ్య కీలక సన్నివేశాలు ఉన్నాయట.. అందుకోసమే కీర్తి సురేష్ ను ప్రత్యేకంగా తీసుకున్నారట. దీంతో రెండు బయోపిక్ లలో సావిత్రి పాత్ర పోషించే అవకాశం కీర్తి సురేష్ కు దక్కడం అదృష్టమే మరి..

ఇక ఎన్టీఆర్ జీవితంలో నాగేశ్వరరావు పాత్ర కూడా కీలకం.. ఈ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్యను తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఏఎన్నార్ పోలికలున్నా హీరో సుమంత్ అయితేనే బాగుంటుందని ఎంపిక చేశారట.. నాగచైతన్యతో సినిమా క్రేజ్ వస్తుందని తెలిసినా కూడా సుమంత్ నే ఏరికోరి ఎంపిక చేశాడట దర్శకుడు క్రిష్. అలాగే సావిత్రి క్యారెక్టర్ కు కీర్తి సురేష్ ను ఖాయం చేశాడట. ఇలా ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా మరోసారి కీర్తి సురేష్ ప్రతిభ వెలుగులోకి రానుంది.