ఏంటి కీర్తి ఈ మేకప్పు!!

0మహానటి చేయకముందు కీర్తి సురేష్ జస్ట్ ఒక హీరోయిన్ గా మాత్రమే ప్రేక్షకులకు పరిచయం. హోమ్లీగా పద్ధతిగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్న కీర్తి మహానటితో ఇమేజ్ పరంగా ఎన్నో మెట్లు పైకి ఎక్కేసింది. ఎంతలా అంటే తను ఉన్న ఏ సినిమా చూసినా వెంటనే మహానటిలో సీన్లే గుర్తుకు వస్తున్నాయి. చక్కని అందంతో గ్లామర్ షో చేయకుండా తనకు మాత్రమే సొంతమైన నిండైన చిరునవ్వుతో కనిపించే కీర్తి సురేష్ మేకప్ పెద్దగా లేకపోయినా కూడా క్యూట్ గా కనిపిస్తుంది. తెలుగులో రైల్ పేరుతో డబ్ అయిన తొడరి సినిమాలో ఈ నిజాన్ని గుర్తించవచ్చు. అలాంటిది మేకప్ వేసుకుంటే ఇంకే స్థాయిలో రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా. కానీ నిన్న జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో కాస్త తేడా కొట్టిన మేకప్ తో వచ్చిన కీర్తి సురేష్ ను చూసి అందరూ షాక్ తిన్నారు. ప్రత్యేకంగా కనిపించాలని అలా వచ్చిందో లేక ఓవర్ టచ్ అప్ తో మేకప్ టీమ్ ఇలా చేసారో తెలియదు అందరి దృష్టి తనవైపే కాసేపు నిలిచింది.

ధగధగలాడే జిగేలు డ్రెస్ తో మెరిసిపోతున్నా మొహమంతా జిడ్డు కారుతున్నట్టుగ ఏదో ఫేస్ ప్యాక్ అప్లై చేసిన కీర్తి అది పూర్తిగా ఆరకుండానే వచ్చేసింది కాబోలు అనుకున్నారు కొందరు. దానికి తోడు కళ్ళ చుట్టూ రాసుకున్న సుర్మా జుత్తంతా అణగదొక్కి నూనె పట్టించి ఒత్తుగా దువ్వడంతో అదో రకమైన లుక్ వచ్చింది. దీంతో మహానటిలో చూసింది తననేనా అనే సందేహం కలిగింది జనాలకు. తన కొత్త సినిమా స్వామి స్క్వేర్ 21న విడుదల కానుంది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజు లేదా ఒక్కరోజు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ప్రకటించవచ్చు. దీని తర్వాత విశాల్ తో నటించిన పందెం కోడి 2 అక్టోబర్ 12న వస్తుంది. కోలీవుడ్ లోనే యమా బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇక్కడ స్ట్రెయిట్ సినిమా చేసే గ్యాప్ దొరకడం లేదు. తను రెడీ అంటే అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.