కీర్తిసురేష్ మొదటి ప్రేమ లేఖ స్టోరీ..!

0

తెలుగు బుల్లి తెరపై రానా హోస్ట్ గా ప్రసారం అవుతున్న నెం.1 యారి షో లో తాజాగా ‘నేను లోకల్’ జంట నాని మరియు కీర్తి సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారిద్దరితో రానా ఒక ఆట ఆడేసుకున్నాడు. వారిని నుండి పలు ఆసక్తికర విషయాలను రాబట్టడంతో పాటు వారిని చక్కని ఆటలు ఆడివ్వడంతో పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. కీర్తి సురేష్ మరియు నానిల నుండి ఎన్నో విషయాలను మెల్ల మెల్లగా రాబట్టడంలో రానా సఫలం అయ్యాడు.

నాని – కీర్తి సురేష్ లతో మీ జీవితాల్లో ఎదురైన అత్యంత క్రేజీ వ్యక్తి ఎవరు అంటూ రానా ప్రశ్నించాడు. కీర్తి సురేష్ అందుకు సమాధానంగా మాట్లాడుతూ.. హీరోయిన్ అయిన తర్వాత నేను ఒక జ్వూవెలరీ షాప్ ఓపెన్ కు వెళ్లాను. అక్కడ జనాలు భారీ ఎత్తున ఉన్నారు. అందులోంచి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ లో నా ఫొటోలు చాలా ఉన్నాయి. నేను నటించిన సినిమాలకు సంబంధించిన స్టిల్స్ – నేను పాల్గొన్న కార్యక్రమాల్లో ని స్టిల్స్ ను ఆ వ్యక్తి క్యాప్చర్ చేసి ఫొటోల రూపంలో నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ ఫొటోలతో పాటు నాకు ఆ వ్యక్తి లవ్ లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ లో ప్రేమిస్తున్నాను – ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ అతడి వివరాలను తెలియజేశాడు. ఆ వ్యక్తి నాకు చాలా క్రేజీగా అనిపించాడని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

ఇక నాని తన జీవితంలో ఎదురైన క్రేజీ వ్యక్తి గురించి మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందు నేను ఒక సినిమా వేడుకలో పాల్గొన్నాను. ఆ వేడుకలో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి షేకండ్ ఇచ్చి నేను మీ అభిమానిని సర్ – మహేష్ బాబు గారిని అడిగినట్లుగా చెప్పండి అంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడి బాడీ లాంగ్వేజ్ నాకు ఇప్పటికి చాలా విచిత్రంగా అనిపించింది. నా కెరీర్ లో నేను చూసిన అత్యంత క్రేజీ వ్యక్తి ఆయనే అంటూ నాని చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer