మహానటి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చిందట!

0కీర్తి సురేష్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. యాక్టింగ్ గ్లామర్ రెండూ ఉండడంతో తక్కువ సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం సాధించింది. ఇక సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తో అందరిచేత నిజంగానే మహానటి అనిపించుకుంది. ఇప్పుడు సౌత్ లో కీర్తి ఓ క్రేజీ హీరోయిన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

విశాల్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పందెంకోడి – 2’ సినిమాలో కీర్తి హీరోయిన్. ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందట. షూటింగ్ చివరి రోజున యూనిట్ మెంబర్స్ అందరికే ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందట. ఇంతకీ అదేంటి? అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. ‘పందెంకోడి – 2’ సినిమాకు కలిసి పనిచేసినందుకు గుర్తుగా ఆ బంగారు నాణేలు బహుమతి అన్నమాట. బంగారం ఇస్తే ఇక యూనిట్ మెంబర్స్ థ్రిల్ అవకుండా ఎలా ఉంటారు?

ఇంకో విశేషం ఏంటంటే.. కీర్తి ఇలా గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇవ్వడం ఇది మొదటి సారి కాదు. ‘మహానటి’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇలాంటి పని చేసిందట. మనతో పనిచేసే వాళ్లకి ఏదైనా ఇవ్వాలంటే బంగారం లాంటి మనసుండాలి.. మహానటి సావిత్రి పాత్రలో నటించింది కదా ఆవిడ మంచితనం ఈవిడ కు కాస్త అలా అంటుకుందేమో!