బాహుబలి మేకర్స్ సినిమాలో మహానటి

0Keerthi-suresh-faced-the-prమలయాళీ భామ కీర్తి సురేష్ ఒక్కసారిగా టాలీవుడ్ లో తెగ బిజీ అండ్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. నేను.. శైలజ అంటూ అరంగేట్రంలోనే హిట్టు కొట్టడం.. ఆ వెంటనే నేను లోకల్ అంటూ బ్లాక్ బస్టర్ సాధించడం.. ఈ భామకు బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు సినిమాలున్నాయి.

పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో లీడ్ హీరోయిన్ గా నటిస్తోన్న కీర్తి.. మరోవైపు సావిత్రి జీవితంపై రూపొందుతున్న మహానటి సినిమాలోను టైటిల్ రోల్ చేస్తోంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాకు ఈ భామ సంతకం చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత.. ఆ చిత్ర నిర్మాతల నిర్మాణంలో రూపొందుతున్న మూవీకి.. కీర్తి సైన్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు కె.ఎస్. ప్రకాష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా.. యంగ్ హీరో శర్వానంద్ ఈ మూవీలో హీరోగా నటించనున్నాడు.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో మహానుభావుడు చిత్రంలో నటిస్తున్న శర్వానంద్.. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే.. ప్రకాష్ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమాలో శర్వాకి జోడీగా కీర్తి సురేష్ ఎంపిక కాగా.. పెర్ఫామెన్స్ ఆధారిత రోల్ కావడంతోనే.. ఈ పాత్రకు కీర్తిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.